జన్యుపరమైన కారణాల వల్ల సంక్రమించే అత్యంత ప్రమాదకర వ్యాధుల్లో తలసీమియా ముఖ్యమైనది. గ్రీకుభాషలో తలసీమియా అంటే సముద్రం. నిజంగానే ఇది సముద్రమంతటి సమస్య. తలసీమియా కారక జన్యువులున్న తల్లిదండ్రులకు జన్మించే చిన్నారుల్లో నూటికి 25 శాతం మంది జన్మతః దీని బారినపడే ప్రమాదం ఉంటుంది. మనదేశంలో ఏటా సుమారు 20 వేలకు పైచిలుకు చిన్నారులు పుడుతూనే తలసీమియా బారినపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే వాస్తవంగా ఇంతకు మూడింతలకు పైగా చిన్నారులు దీని బారినపడుతున్నట్లు తెలుస్తోంది. తలసీమియా కారణంగా శరీరానికి అవసరమైనంతగా హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి కాదు. ఒకవేళ తయారైనా అది ఎక్కువకాలం మనలేదు. ఈ పరిస్థితి కారణంగా శరీరంలోని హిమోగ్లోబిన్‌ నిల్వలు దారుణంగా పడిపోతాయి. అలా పడిపోయిన ప్రతిసారీ రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని అందించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ప్రాణనష్టం తప్పదు. 

లక్షణాలు, నిర్ధారణ

తలసీమియా బాధితుల్లో పుట్టిన 6 నుంచి ఏడాదిన్నర లోపు రక్తహీనత, ఎదుగుదల లేకపోవడం, కాలేయం, ప్లీహం వ్యాకోచించడం వంటి లక్షణాలు ఉంటాయి. సమగ్ర రక్తపరీక్ష ద్వారా రక్తహీనతను కనుక్కోవచ్చు. దీని వల్ల తలసీమియా, లేదా సికిల్‌ సెల్‌ వ్యాధి ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా.. అనుమానం ఉన్నప్పుడు హెచ్‌బి ఎలక్ట్రో పోరోసిస్‌ పరీక్షతో వ్యాధిని నిర్ధారిస్తారు. 

అదుపు చేయటం ఎలా?

తలసీమియా బాధితులకు మూడు వారాలకి ఒకసారి రక్తం ఎక్కించాలి. 'సెలైన్‌ వాష్డ్‌ సెల్‌' రక్తం ఎక్కిస్తే ఇంకా మంచిది. రక్తం ఎక్కించకముందు హెచ్‌బి స్థాయి 9 గ్రాముల శాతం కన్నా తక్కువ ఉండకూడదు. రక్తం ఎక్కించాక 12 గ్రాముల శాతం స్థాయి వద్ద నిలకడగా ఉండాలి. తలసీమియా మేజర్‌ ఉందని కనుక్కోగానే ఆ శిశువుకు హెపటైటిస్‌-బి (నాలుగు డోసులు) టీకాలు ఇవ్వాలి. నిర్ణీత కాల వ్యవధిలో తరచు-హెపటైటిస్‌ బి లేదా సి, హెచ్‌.ఐ.వి. నిర్ధారణ పరీక్షలు సీరంలో ఫెర్రిటిస్‌, కాల్షియం, ఫాస్పరస్‌ స్థాయిలు తెలిపే పరీక్షలు. దంత పరీక్ష, గుండె మూత్ర పిండాలు, వినాళగ్రంథులు సరిగ్గా పనిచేస్తున్నదీ లేనిదీ తెలిపే పరీక్షలు చేయించాల్సి వస్తుంది. తలసీమియా ఉన్నవారికి మాంస కృత్తులు (ప్రోటీన్లు), కేలరీలు అధికంగాను, ఐరన్‌ తక్కువగాను ఉండే ఆహారం ఇవ్వడం మంచిది. రక్తం ఎక్కించడం (ట్రాన్స్‌ ఫ్యూజన్‌) మొదలుపెట్టాక 15 ట్రాన్స్‌ ఫ్యూజన్లు కాగానే ఒకసారి ఆ తర్వాత సీరం ఫెర్రిటిస్‌ 1000 జిఎం/ఎం ఉన్నప్పుడు ఐరన్‌ చిలేషన్‌ చికిత్స అవసరం అవుతుంది. తగిన దాత దొరికి, ఖర్చులు భరించగలిగితే ఎముక మజ్జ మార్పిడి (బోన్‌ మారో ట్రాన్స్‌ ప్లాంటేషన్‌)తో వ్యాధిని నయం చేయవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE