ఏడాదిలోపు పిల్లలు నోట్లో వేలేసుకోవటం సహజమే. ఆకలిగా ఉన్నప్పుడు, ఒంటరిగా, అసౌకర్యంగా ఉన్నప్పుడు, చనుబాలు తాగాలనిపించినప్పుడు పిల్లలు నోట్లో వేలు వేసుకుంటూ ఉంటారు. సాధారణంగా ఈ అలవాటు చనుబాలు తాగే పిల్లల్లో కంటే సీసాపాలు తాగే చిన్నారుల్లో ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తుంది. సహజంగా రెండు మూడు ఏళ్ళు నిండేసరికి పిల్లలు తమంతట తామే ఈ అలవాటును మానుకొంటారు. అయితే.. కొందరు పిల్లల్లో ఐదేళ్లు వచ్చినా ఈ అలవాటు కనిపిస్తుంది. దీనివల్ల అలాంటి పిల్లల దవడలు, దంతాల ఆకృతి మారిపోవటమే గాక పిల్లలు మట్టిలో ఆడుకుంటూ మట్టి అంటిన వేలిని నోట్లోపెట్టుకోవటంతో మట్టిలోని క్రిములు పొట్టలో చేరి నులి పురుగులు, వాంతులు , విరోచనాలు , కడుపునొప్పి వంటి సమస్యలు ఎదురువుతాయి. అయితే.. కొన్ని జాగ్రత్తలు పాటించటం ద్వారా పిల్లల ఈ అలవాటును మార్పించవచ్చు.

ఇలా చేయాలి

సాధారణంగా వయసుతో బాటు పిల్లలు ఈ అలవాటును తమంతట తామే మానేస్తుంటారు. అప్పటికీ వారిలో ఈ రకమైన మార్పు కనిపించకపోతే ఈ దిగువ సూచనలు పాటించాలి.

  • పిల్లలు నిద్రించే సమయంలో మెల్లిగా వారి నోట్లోంచి వేలును తీసివేయాలి.
  • ఏడాది నిండినా ఆ అలవాటు మానకపోతే వేళ్లకు స్టిక్కింగ్ ప్లాస్టర్ అంటించి దానికి ఏదైనా చేదుపదార్థం రాయాలి.
  • మూడేళ్ళకూ మానకపోతే దంత వైద్యులకు చూపిస్తే.. వారు లోహపు ప్లేటును అమర్చుతారు. దీనివల్ల నోట్లో వేలుపెట్టుకొంటే ప్లేటులోని ముళ్లు గుచ్చుకుని నోట్లో వేలు వేసుకోరు. అలా క్రమంగా కొన్నాళ్లకు ఈ అలవాటు మానుకొంటారు.
  • ఆటపాటల్లో పిల్లల విజయాలను మెచ్చుకొని, బహుమతులిస్తూ ఆ అలవాటు మానుకోమని ప్రేమగా చెప్పటం వల్ల మంచి ఫలితాలుంటాయి.
  • పిల్లల్లోని సృజనను తట్టిలేపి వారిని సంగీతం, సాహిత్యపఠనం, చిత్రలేఖనం వైపు ప్రోత్సహిస్తే ఆ వ్యాపకాల్లో మునిగి ఈ అలవాటును త్వరగా మనుకుంటారు.
  • వయసుకు తగిన బొమ్మలను అందుబాటులో ఉంచటం, వేళకు ఆహారం తినిపించటం ద్వారా ఈ అలవాటును మాన్పించవచ్చు.
  • తీవ్రమైన ఒత్తిడి, మానసిక సమస్యలున్న పిల్లల్లో ఈ అలవాటును మాన్పించేందుకు మానసిక విశ్లేషకుల సాయం తీసుకోవాలి.

చేయకూడనివి

  • అలవాటుమానుకోమని పిల్లలను భయపెట్టటం, కొట్టటం వంటివి చేయరాదు. తోటి పిల్లల ముందు అవమానంగా మాట్లాడరాదు.
  • అలసిపోయి నిద్రపోతున్నప్పుడు లేదా ఏదైనా ఆలోచిస్తున్న సందర్భాల్లో నోట్లో వేలేసుకున్నాపెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE