రోజువారీ శారీరక అవసరాలకు తగ్గట్లు ఆహారంలో ప్రొటీన్లు ఉండేలా చూసుకోవటం ఎంతో అవసరం. అయితే ప్రోటీన్లు అధికంగా తీసుకుంటే కండలు తిరిగే దేహం సొంతం చేసుకోవచ్చేనే అపోహ వల్ల యువత ప్రొటీన్‌ పౌడర్లు ఎక్కువగా వాడుతున్నారు. అయితే అవగాహన లేకుండా అతిగా ప్రోటీన్లు తీసుకుంటే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రొటీన్ల అవసరం విషయంలో వయసు, జీవనశైలి వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. మితిమీరిన ప్రొటీన్ల వినియోగంతో వచ్చే సమస్యల గురించి వారు చెబుతున్న కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం.  

ఎవరికెంత?

నిపుణుల లెక్క ప్రకారం ఒక రోజుకు సాధారణ శ్రమ చేసే పురుషులకు 56గ్రా, మహిళలకు 45గ్రా ప్రొటీన్లు అవసరం. 11 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లల శరీర బరువు ఎన్ని కిలోలుంటే అన్ని గ్రాముల ప్రొటీన్‌, 14 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలకు ప్రతి కిలో శరీర బరువుకు 0.8 నుంచి 1గ్రా ప్రొటీన్‌ ఆహారంలో అందిస్తే చాలు. ఇక.. గర్భిణులు తమ కిలో శరీర బరువుకు 1.5గ్రా ప్రొటీన్‌ చొప్పున, మెనోపాజ్‌ వయసు మహిళలైతే కిలో శరీర బరువుకు 1గ్రా ప్రొటీన్‌ చొప్పున ప్రోటీన్ అందేలా చూసుకోవాలి. 

మితిమీరితే వచ్చే ఇబ్బందులు 

  • ప్రొటీన్ల వినియోగం పెరిగే కొద్దీ శరీరంలో ఆమ్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ అదనపు ఆమ్లాన్ని విసర్జించే సమయంలో ఎముకలలోని కాల్షియం కూడా మూత్రం ద్వారా విసర్జింపబడి క్రమంగా ఎముకలు బలహీనపడతాయి.
  • మితిమీరిన ప్రొటీన్ల వినియోగంతో కిడ్నీల్లో కీటోన్ల రూపంలో వ్యర్ధాలు పోగుపడతాయి. వీటిని వడపోసి విసర్జించే క్రమంలో కిడ్నీలు ఎంతో శ్రమకు లోనవుతాయి. ఈ ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగితే కిడ్నీలు తీవ్రమైన పనిఒత్తిడి గురై అంతిమంగా వాటి పనితీరు తగ్గుతుంది.
  • ఇతర పోశాలు తీసుకోకుండా కేవలం ప్రొటీన్ల మీదే ఆధారపడితే వ్యాయామం చేసినప్పుడు చెమట రూపంలో ద్రవాలు వెళ్లిపోయి శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.
  • పెద్దగా శారీరక శ్రమలేనివారు, రోజంతా నీడపట్టున ఉండేవారు అదనంగా ప్రొటీన్లు తీసుకోవటం వల్ల శరీరంలో కొవ్వు పెరిగి, బరువు పెరిగుతారు. దాన్ని తగ్గించుకోవటానికి తిరిగి వ్యాయామం చేయాల్సి రావటంతో శరీరం అనవసరపు ఒత్తిడికి గురవుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE