ఆరోగ్య పరిరక్షణలో విటమిన్ డి ఎంతో అవసరం. మిగిలిన విటమిన్లు ఆహారం ద్వారా అందుతాయి తప్ప శరీరం తనంతట తయారు చేసుకోలేదు. కానీ ఒక్క విటమిన్‌-డి( బహు స్వల్పంగా ఆహారంలో లభించినా)మాత్రం శరీరంలో తయారవుతుంది. ఎముకలు ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి పనితీరు, రక్తనాళాల సామర్ధ్యం, ఇన్సులిన్ ఉత్పత్తి..ఇలా ఎన్నో కీలక జీవక్రియల నిర్వహణలో విటమిన్ డి కీలకపాత్ర పోషిస్తుంది. నీడపట్టున కూర్చొని చేసే ఉద్యోగాలు, నగరాల్లో పెరిగిన అపార్టుమెంట్ కల్చర్ వల్ల విటమిన్ లోపం నానాటికీ ఎక్కువవుతోంది. ఉష్ణ మండల ప్రాంతంలో ఉన్న మన దేశంలో నూటికి 80 మంది విటమిన్-డి కొరతను ఎదుర్కొంటున్నట్లు గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో అందరూ విటమిన్ డి వినియోగం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిందే.

ప్రధాన ఉపయోగాలు

 • తెల్లరక్తకణాలు చురుకుగా ఉండి, రోగకారక క్రిములతో పోరాడేలా చేసి రోగ నిరోధక శక్తిని పెంచటం
 • రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడటం, క్లోమంలోని బీటా కణాలపై పని చేసి ఇన్సులిన్‌ ఉత్పత్తి సజావుగా సాగేలా చూడటం
 • శరీరంలో కణ విభజనను నియంత్రించి క్యాన్సర్‌ రాకుండా చేయటం
 • ఆహారంలోని క్యాల్షియాన్ని పేగుల ద్వారా రక్తంలో కలిసేలా చూడటం, రక్తంలోని క్యాల్షియాన్ని ఎముకల్లోకి పంపి వాటిని బలపరచడం 

లోపిస్తే కనిపించే లక్షణాలు

 • ఉరోస్థి (గుండె/ ఊపరితిత్తులు ఉండే ఎముకల గూడు) భాగంలో నొప్పి
 • కండరాలూ, కీళ్ల నొప్పులూ, ఒళ్ళు నొప్పులు
 • విశ్రాంతి తీసుకున్నా కనిపించే అలసటా, ఒత్తిడీ
 • క్షణక్షణానికీ మారే మనఃస్థితి, భావోద్వేగాలు, అసాధారణంగా బరువు పెరగటం
 • వాతావరణం చల్లగా ఉన్నా తలలో చెమటలు పట్టడం, ఒంటి దురద, చిరాకు
 • పిల్లల్లో రికెట్స్ (ఎముకలు వంకర్లు తిరగటం), మహిళల్లో మానసిక ఒత్తిడి, కండరాల బలహీనత
 • చిన్న వయసులోనే మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలు రావటం
 • నాడీ వ్యవస్థ బలహీనత, పాదాల్లో స్పందనలు తగ్గడం 

లోపాన్ని అధిగమించాలంటే..

 • సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో ఓ అరగంట ఎండలో గడపాలి. దీర్ఘకాలికంగా విటమిన్  లోపమున్నవారు కనీసం 2 నెలలు ఎండలో తిరిగితేనే కనీస స్థాయిలో విటమిన్ డి లభిస్తుంది.
 • పుట్టగొడుగులు, జున్ను,సముద్ర చేపలు, గుడ్డు పచ్చసొన, సోయాపాలు, బత్తాయి రసం, పాల ఉత్పత్తులు, బ్రొకోలీ, దానిమ్మ, నారింజ, బాదం, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE