ఆహారంలోని కొవ్వులను జీర్ణం చేయటంలో కాలేయం పాత్ర చాలా కీలకం. కాలేయంలో సహజంగా ఉండే కొవ్వుకు అదనంగా మరికొంత కొవ్వు రోజూ ఇతర భాగాల నుంచి చేరుతుంది. అయితే.. కొందరిలో కాలేయకణాలలో కొవ్వుతో బాటు సంక్లిష్టమైన ట్రైగ్లిజరైడ్‌ కణాలూ చేరతాయి. మద్యమాంసాలు తీసుకునేవారిలో ఈ మార్పు తీవ్రంగా ఉండటంతో కాలేయం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఈ స్థితిలో కాలేయ కణాలు చేరే కొవ్వును సరళ పదార్థాలుగా మార్చలేకపోవటంతో కొవ్వునిల్వలు పోగుపడతాయి. ఈ పరిస్థితినే వైద్యపరిభాషలో 'ఫ్యాటీలివర్‌' అంటారు.

లక్షణాలు

సమస్య ప్రాథమిక స్థాయి ఎలాంటి లక్షణాలు పైకి కనిపించవు. అయితే.. సమస్య ముదిరేకొద్దీ కాలేయంవాపు, హెపటైటిస్‌, సిర్రోసిస్‌ రావచ్చు. కొందరిలో కామెర్లు, కడుపు కుడివైపు నొప్పి, వాపు ఉంటాయి. దీనివబారిన పడిన గర్భిణుల్లో వాంతి వచ్చినట్లు అనిపించడం, ఆకలి లేమి, కడుపు నొప్పి వంటి లక్షణాలుంటాయి.

 కారణాలు

మితిమీరిన మద్యపానం

ఊబకాయం

ఆకలి లేకపోవటం

మధుమేహం

కొలెస్ట్రాల్ ఎక్కువ కావటం

కొన్ని రకాల మందుల వినియోగం వల్ల

రకాలు

ఫ్యాటీలివర్‌ సమస్య 2 రకాలు. మొదటిది ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌. ఇది కేవలం మితిమీరిన మద్యపానం చేసేవారిలో కనిపిస్తుంది. రెండవది నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌. ఆల్కహాల్ తీసుకోకపోయినా ఊబకాయం, మధుమేహం, బక్కపలచనివారిలో కనిపిస్తుంది. కొందరిలో వంశపారంపర్యంగా, వాడిన మందుల వల్ల కూడా రావచ్చు.

నిర్ధారణ, చికిత్స

ఫ్యాటీలివర్‌ సమస్యను రక్తపరీక్ష ద్వారా గుర్తించవచ్చు. ఈ పరీక్షలో కాలేయంలోని ఎంజైములలో వచ్చిన మార్పులను తెలుసుకోవచ్చు. మరికొందరిలో లివర్‌ బయాప్సీ అవసరమవుతుంది. సమస్య తీవ్రతను బట్టి వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు. ఇప్పటిరోజుల్లో ఈ సమస్యకు మంచి వైద్యం అందుబాటులో ఉంది గనుక బాధితులు వెంటనే వైద్యుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి.

నివారణ

మసాలా పదార్థాలు తగ్గించాలి.

మరీ చల్లని ఆహారం తినరాదు.

అతిగా వేపుళ్లు తినరాదు.

వంటకాల్లో పులుపు తగ్గించాలి

తాజా కూరగాయలు ఎక్కువగా తినాలి

అధిక బరువు తగ్గించుకోవాలి.

మద్యపానం జోలికిపోకుండా ఉండాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE