వయసుతో బాటు శరీరంలోనూ మార్పులు రావటం సహజమైన ప్రక్రియ. ఇలాంటి మార్పుల్లో ప్రోస్టేట్ గ్రంథి వాపు ఒకటి. నడివయసు దాటిన పురుషుల్లో ప్రోస్టేటు గ్రంథి ఎంతోకొంత ఉబ్బటం సహజమే. నిజానికి ఇది జుట్టు నెరవటం, ముఖ చర్మం ముడతలు పడటం వంటి వయసుకారక మార్పు తప్ప అనారోగ్యం కాదు. అయితే.. ఈ అంశంపై తగిన అవగాహన లేకపోవటం, అపోహల కారణంగా చాలామంది వృద్ధులు ప్రోస్టేట్ గ్రంథి వాపు విషయంలో అనవసరంగా కంగారుపడి పదేపదే వైద్యపరీక్షలు చేయించుకొంటున్నారు. అందుకే నడివయసు దాటిన వారు ప్రోస్టేట్ గ్రంథి పనితీరు విషయంలో తగిన అవగాహనను పెంచుకోవాలి. అప్పుడే అనవసరపు భయాలకు, అపోహలకు అవకాశం ఉండదు. 

 ఈ లక్షణాలుంటేనే.. చికిత్స

  • తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం, మూత్రం చుక్కలు చుక్కలుగా లేదా సన్నగా రావటం
  • మూత్రం పూర్తిగా బయటకురాకుండా, కొద్దిగా మూత్రాశయంలోనే ఉండిపోయి ఇన్‌ఫెక్షన్లు రావటం, దాంతో జ్వరం, చలి వేధించటం
  • ఎక్కువమొత్తం మూత్రాశయంలో నిలిచిన మూత్రం వెనక్కి..అంటే కిడ్నీల్లోకి వెళ్లి వాటి పనితీరును దెబ్బతీయటం 

మేలైన చికిత్స

 ప్రోస్టేట్ బాగా ఉబ్బి, ఇబ్బంది పెడుతుంటే.. గతంలో సర్జరీ మినహా మరోమారం ఉండేదికాదు. కానీ ఇప్పటిరోజుల్లో నూటికి 95 శాతం ప్రోస్టేట్ సమస్యలకు మంచి ఔషధాలు ఉన్నాయి. సాధారణంగా ఈ సమస్యకు వాడే మందులు రెండురకాలు. అవి

  • కండరం మీద పనిచేసే ఆల్ఫా బ్లాకర్స్ : ఇవి ప్రోస్టేట్ గ్రంథి లోపలి మెత్తని కండరం బిగువును తగ్గించి మూత్రమార్గం వదులయ్యేలా చేసి మూత్ర విసర్జనను సులభతరం చేస్తాయి. వీటిని రోజూ వాడాలి. వాడటం మొదలుపెట్టిన 2, 3 రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. సమస్య తీవ్రతను బట్టి కొందరు వీటిని జీవితాంతం వాడాల్సిరావచ్చు. అయితే ఈ మందుల వల్ల ప్రమాదకరమైన ప్రతికూల ప్రభావాలు ఉండవు.
  • హార్మోన్లను ప్రభావితం చేసే 5 ఆల్ఫా-రిడక్టేస్ ఇన్‌హిబిటార్స్: ఇవి టెస్టోస్టిరాన్ హార్మోన్ మీద పనిచేసి ప్రోస్టేటు గ్రంథి పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి నెమ్మదిగా పనిచేస్తాయి కనుక కనీసం 6 నెలలు వాడాలి. ఈ మందుల వల్ల ప్రోస్టేట్ సైజు సగం వరకూ తగ్గే అవకాశముంది. 

గమనిక

ఈ మందులు వాడిన కొందరిలో బీపీ తగ్గి కళ్ళు తిరగటం.. ముఖ్యంగా రాత్రి మూత్రానికి వెళ్లినపుడు కళ్లు తిరిగి పడిపోవటం ఉండే ప్రమాదం ఉంటుంది గనుక మందులు వాడకం మొదలెట్టిన 2, 3 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పడుకున్నవాళ్లు కాసేపు కూచుని, అప్పుడు లేవాలి. వీలైతే వెంట ఎవరైనా ఉండేలా చూసుకోవటం మంచిది. 2, 3 రోజులకు మించి ఈ లక్షణాలు కనిపిస్తే మందులు ఆపి వైద్యుడిని సంప్రదించాలి. మందులు వాడటం మొదలుపెట్టిన 2,3 రోజుల్లో ఈ లక్షణాలు కనిపించకపోతే సాధారణంగా ఆ తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE