వయసుతో బాటే దంత సమస్యలో తప్పవనేది చాలామంది అపోహ. అయితే చిగుళ్ల, దంతాల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటమే అన్ని దంత సమస్యలకు మూలమనీ, తగు జాగ్రత్తలు తీసుకుంటే ముదిమిలోనూ చక్కని దంతసిరిని నిలుపుకోగలరని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇదీ సమస్య

అనేక దంత సమస్యలకు మూలం.. 'పెరిడాంటైటిస్‌’ అనే చిగుళ్ల సమస్యే. దంతాలను శుభ్రం చేసుకోకపోవటం వల్ల వాటిపై పాచి చేరుతుంది. పాచికితోడు ఆహారపు ముక్కలు చేరి అక్కడ బ్యాక్టిరియా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా విడుదల చేసే విషపదార్థాల వలన చిగుళ్లు వాచి ఉబ్బి, ఎర్రగా మారిపోతాయి. తొలిదశలో నోటి దుర్వాసన, చిగుళ్ల వాపుతో మొదలయ్యే ఈ సమస్య వల్ల మలిదశలో చిగుళ్లు రక్తం కారటం, క్రమేపి చిగుళ్లు వదులైపోవటం జరుగుతుంది. అప్పటికీ చికిత్స తీసుకోకపోతే సమస్య ముదిరి.. పంటి చిగురునుంచి మూలానికి పాకి మొత్తం పంటికే ఎసరు వస్తుంది. ఒక్కోసారి ఈ సమస్య ముదిరి ఆ ఇన్‌ఫెక్షన్‌ లిగమెంట్‌కు కూడా పాకి పంటి వేరు చుట్టూ బలంగా ఉండే ఎముక సైతం దెబ్బతిని మెత్తబడి పన్ను కదలబారటం, క్రిందకిజారటం, వంకర తిరగటం, దంతాల మధ్య సందులు రావటం వంటి పరిమాణాలు తలెత్తి చివరికి దంతం ఊడిపోతుంది. 

చికిత్స

సమస్య దశను బట్టి చికిత్స ఉంటుంది. ముందుగా మత్తు ఇచ్చి పళ్ల చిగుళ్ల లో పేరుకున్న పాచి, గారలను శుభ్రం చేస్తారు. దీనిని సబేజింజువల్‌ క్రూరటాజ్‌ అంటారు. ఒకవేళ చిగుళ్ల పటుత్వం బాగా తగ్గిపోతే ఎక్స్‌రే సాయంతో చిగుళ్లకి ఎముక ఆధారం ఏ మేరకు తగ్గిపోయిందో నిర్దారించి, ఆ తర్వాత  అవసరం మేరకు చిగుళ్లను కొద్దిగా ఒలిచి శుభ్రం చేస్తారు. దీన్నే ”ప్లాప్‌ సర్జరీ” అంటారు. ఇక కింది పంటి వేరు చుట్టూ ఉండే ఎముక కూడా అరిగిపోతే దాని శుభ్రపరచి దాని  స్థానంలో కృత్రిమ ఎముకను అమర్చే విధానాలు కూడా ప్రస్తుతం ఉన్నాయి.Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

ధర్మమే సుగుణాభిరాముని మార్గం

తన సుగుణాలతో, సుపరిపాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్న చక్రవర్తి శ్రీరాముడు. ఆ జగదభిరాముని జన్మదినమే శ్రీరామనవమి.

MORE