మాతృత్వం ఒక అమూల్యమైన వరం. అయితే కొన్నిసందర్భాల్లో గర్భస్రావం శాపంగా పరిణమించి మహిళలు ఈ వరానికి దూరమవుతుంటారు. వైద్యపరిభాషలో అరకిలో బరువున్న లేదా ఆరోనెల లోపు పిండం పడిపోయినా దాన్ని గర్భస్రావం అంటారు. ప్రపంచవ్యాప్త గణాంకాల ప్రకారం సగం మంది మహిళలు ఈ సమస్య బారినపడుతున్నారు. ఈ సమస్య మహిళలను మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. ఒకసారి గర్భస్రావం అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు గానీ పదేపదే ఇలా జరుగుతున్న కేసుల్లో సమస్య కారణాలను తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాలి.

కారణాలు

ప్రధానంగా పిండం ఎదుగుదల లోపాల వల్ల ఎదురయ్యే ఈ సమస్యకు ఆలస్యంగా గర్భం దాల్చటం, గర్భసంచిలో లోపాలు, గర్భకోశపు కంతులు, క్షయ, పీసీఓడీ, థైరాయిడ్‌ గ్రంథి పనితీరులో లోపాలు, మధుమేహం, జన్యు లోపాలూ సమస్యకు కారణం కావచ్చు. పలుమార్లు అవాంఛిత గర్భం తొలగించటం, రక్తం గడ్డకట్టడంలో తేడా, ఎపిఎల్‌ఎ సిండ్రోం, ధూమపానం, పెల్విక్‌ ఇన్‌ఫెక్షన్లు, మానసికంగా అశాంతి, ఉద్యోగంలో పనిఒత్తిడి వంటివి కూడా గర్భస్రావానికి కారణం కావొచ్చు.

చికిత్స

రెండోసారి గర్భస్రావం అయితే, ఆలస్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో ఉండి కొన్ని రకాల పరీక్షలు చేయించి ఫోలిక్‌ యాసిడ్‌ వాడుకుని మళ్లీ గర్భధారణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అలాగే పడిపోయిన పిండాన్ని పరీక్షలకు పంపి ఏవైనా జన్యు సమస్యలు ఉంటె తెలుసుకోవచ్చు. ఒకవేళ మేనరిక వివాహం అయితే దంపతులకు కెరియోటైపు పరీక్ష అవసరం అవుతుంది. అవసరాన్నిబట్టి కొన్ని రక్తపరీక్షలు, స్కానింగు, థైరాయిడ్‌ పరీక్షలు అవసరం కావచ్చు. ఒకవేళ గర్భకోశంలో లోపాలు, సర్విక్స్‌ వదులుగా ఉండటం వంటివి సమస్యకు కారణమయితే సర్జరీ ద్వారా సరిదిద్దొచ్చు. లేదా నాలుగో నెలలో సర్విక్స్‌కు కుట్టువేసి బిగుతుగా మార్చవచ్చు. గర్భం నిర్ధారణ అయిననాటి నుంచి వైద్యుల సలహా మేరకు మందులు వాడుకుని, తగిన పోషకాహారం, విశ్రాంతి తీసుకొంటే ఈ సమస్య ప్రస్తావనే లేకుండా పండంటి బిడ్డకు జన్మనివ్వొచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE