ఇప్పటిరోజుల్లో మధుమేహం సాధారణ అనారోగ్యంగా మారింది. నిజానికి మధుమేహం అనారోగ్యం కాదు. ఇది కేవలం శారీరక మార్పు మాత్రమే. అయితే దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రమాదక రోగాలకు దారితీస్తుంది.   అందుకే మధుమేహులు తమ రక్తంలోని చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి.

ఈ లక్షణాలుంటే పరీక్షలు  తప్పనిసరి 

 • పదేపదే మూత్రానికి పోవాల్సిరావటం, అకారణంగా బరువు తగ్గటం,
 • అలసట, నీరసం, చూపు మందగించటం,
 • గాయాలు మానకపోవటం, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, చిగుళ్ళు ఎర్రగా మారి వాపు కనిపించటం
 • కుటుంబ పెద్దల్లో ఎవరికైనా మధుమేహం లేదా ఊబకాయం ఉంటే
 • మితిమీరిన దాహం, ఆకలి

మధుమేహ కారక సమస్యలు

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే సన్నని నాళాల్లో కొవ్వుపేరుకొని రక్తప్రసారం ఆగిపోయి గుండెపోటు రావచ్చు.  ఒకవేళ పెద్ద రక్తనాళాలు మూసుకుపోతే  కాళ్ళలో రక్తనాళాలు దెబ్బతిని గాంగ్రిన్ వంటి సమస్యలు రావచ్చు. నరాలు, వాటిపై పొర దెబ్బతిని ‘న్యూరోపతి’,  రక్తనాళాలు దెబ్బతిని  ‘వాస్క్యులోపతి’ సమస్య ఎదురుకావచ్చు.అధిక రక్తపోటు సమస్య ఎదురుకావచ్చు. ఒక్కోసారి మూత్ర పిండాలు దెబ్బతినవచ్చు. అంగస్తంభన వాటి సమస్యలతో దాంపత్య జీవితం పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. సులభంగా ఇన్‌ఫెక్షన్స్ సోకటం,

కళ్ళలోని రెటీనా దెబ్బతినటం  సంభవించవచ్చు.

పాటించాల్సిన జాగ్రత్తలు

 • ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించాలి.
 • ఖాళీ కడుపుతో ఉండరాదు. అలాగని కడుపునిండా తినరాదు. ప్రతి 4 గంటలకోసారి విడతలుగా పరిమితంగా ఆహారం తీసుకోవాలి.
 • పీచు పదార్థాలున్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.
 • రోజూ 40 నిమిషాలు అలసిపోయేలా నచ్చిన వ్యాయామం చేయాలి.
 • రోజంతా ఒకేచోట కూర్చోవటం, బద్దకమైన జీవనశైలిని మానుకోవాలి.
 • పాదాలకు గాయాలు కాకుండా చూసుకోవాలి. వారానికొకసారి పాదాల్నిగోరు వెచ్చని నీటిలో ఉంచి, శుభ్రంగా తుడవాలి. చిన్న చిన్న పొక్కులున్నా చిదపకూడదు. ఇంట్లో తిరుగుతున్నా పాదరక్షలు వేసుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE