వర్షాకాలం వచ్చేసింది. ఈ రోజుల్లో కొత్త నీటితోపాటు కొత్త వ్యాధులూ రావడం సహజం. రోడ్లన్నీ బురదమయమై, వాటిపైగల చెత్తచెదారం కుళ్లి.. ప్రాణంతక వైరస్‌లు, బాక్టీరియా వ్యాపించే సమయమిది. ఈ రోజుల్లోనే దోమల బెడదా పెరుగుతుంది. పరిశుభ్రత లోపించటం వల్ల శ్వాస, జీర్ణ సంబంధిత సమస్యల బెడద కూడా ఏ ఈరోజుల్లో చాలా ఎక్కువ. అందుకే ఈ వానాకాలంలో ఆరోగ్య పరిరక్షణన కోసం వాస్తవ పరిస్థితికి అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 

జాగ్రత్తలు

  • దోమలబెడద నుంచి తప్పించుకోవాలంటే ఇంటి పరిసరాల్లో సీసా పెంకులు, కుండీలు, పాత టైర్లు, పగిలిన పెంకులు, ఖాళీ డబ్బాలు, కూలర్లలో నీరు లేకుండా చూసుకోవాలి. అలాగే ఇంటిపరిసరాల్లో వాననీరు నిల్వ కాకుండా చూసుకోవాలి.
  • ఇంట్లో చేరిన బూజు,దుమ్ము,ధూళిని పూర్తిగా తొలగించటం ద్వారా శ్వాసకోశ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
  • ఈ సీజన్లో అతిగా కాఫీ,టీ సేవించటానికి బదులు గోరువెచ్చటి నీరు తాగటం మంచిది. రోజుకు కనీసం 8 గ్లాసులు తాగాలి.
  • ఈ రోజుల్లో నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు అధికం గనుక నీటిని తప్పక కాచి చల్లార్చి మాత్రమే తాగాలి.
  • వానలో తడవటం సరదాగా ఉన్నా దానివెంటే జలుబు, ముక్కుదిబ్బడ వంటి ఇబ్బందులు వస్తాయి. కనుక ఈ రోజుల్లో చిన్న గొడుగు వెంట తీసుకెళ్ళడం మంచిది.
  • ఒకవేళ వానలో తడిస్తే ఇంటికి రాగానే తలతుడుచుకోవాలి. వేడినీటితో తల స్నానం చేస్తే మరీమంచిది.
  • వర్షాకాలంలో మిరియాలపొడి వేసిన సూపులు,వేడిగా తీసుకోవాలి.
  • ఈ రోజుల్లో ఉల్లి, కీరా,కారట్,కాబేజీ వంటి పచ్చి కూరగాయ ముక్కలు,తురిమి నిల్వ ఉంచితే బాక్టీరియా చేరి డయేరియా వచ్చే ముప్పు పొంచి ఉంటుంది గనుక వాటివి వాడి చేసే రోడ్డువెంట చిరుతిళ్ళు తినకపోవడమే మంచిది.
  • ఆకుకూరలు, కూరగాయాలు ఉప్పు నీళ్లతో కడిగి వాడుకోవాలి.
  • అల్లం..లెమన్..హెర్బల్ టీ, వేడివేడి సూపులు తాగడం మంచిది.Recent Storiesbpositivetelugu

యాప్ సాయంతో పరీక్షల్లో రాణింపు 

 ఫిబ్రవరి వచ్చేసింది. విద్యార్థులు  పరీక్షల కోసం రాత్రీ పగలూ చదువుకొనే సమయం. ఇన్నాళ్లుగా చదివిన  పాఠాలు, విషయాల్ని 

MORE
bpositivetelugu

మోక్షసిద్దినిచ్చే కర్ణాటక  సప్త క్షేత్రాలు

భక్తుని అంతిమ లక్ష్యం మోక్షమే. అంటే.. మరల మరల జన్మనెత్తవలసిన అవసరం లేకపోవటం. ఈ మోక్షసిద్దికి అయోధ్య, మథుర, 

MORE