విపరీతమైన రక్తస్రావం కారణంగా కొందరికి నెలసరి దగ్గరపడుతోందంటే చెప్పలేనంత భయం ఉంటుంది. 5 రోజులకు మించి నెలసరి ఉండటం, ఆ సమయంలో అధిక రక్తస్రావం కావటం, రక్తం ముద్దలు ముద్దలుగా పడటం వంటి లక్షణాలు 2 నెలలకు మించి కనిపిస్తే ఏమాత్రం నిర్లక్యం చేయకుండా వైద్యసలహా కోరాల్సిందే.

బాధితులు వీరే

గర్భాశయ కండరాల్లో పెరిగే ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్‌, కొన్నిఇన్‌ఫెక్షన్లు, పాలిప్స్‌ అధిక రక్తస్రావానికి కారణం కావచ్చు. అలాగే కొందరిలో కటివలయ భాగంలో వచ్చే ఇన్‌ఫెక్షన్లతో బాటు మరికొందరు నడి వయసు మహిళల్లో అరుదుగా కనిపించే ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ వల్ల కూడా అధిక రక్తస్రావ సమస్య కనిపిస్తుంది.

పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌ మూలంగా నెలనెలా అండం విడుదల కాని వారిలో, థైరాయిడ్‌ బాధితుల్లోనూ ఈ సమస్య కనిపించొచ్చు.

కీమోథెరపీలో భాగంగా ఇచ్చే కొన్నిరకాల ఔషధాల వల్ల కూడా ఈ సమస్య కనిపించే ప్రమాదం ఉంది.

పరీక్షలు

సమస్యకు రక్తహీనత కారణమయ్యే అవకాశం చాలా ఎక్కువ గనుక అందుకు సంబంధించి పరీక్షలు చేయాల్సిరావచ్చు. 45 ఏళ్ళు దాటి, నెలసరి, నెలసరికీ మధ్యలో రక్తస్రావం అవుతున్నా, కలయిక తరవాత రక్తం, నొప్పి ఉన్నా అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేయాలి . దీనివల్ల లోపాలు ఫైబ్రాయిడ్లు, పాలిప్స్‌ ఉన్నా గుర్తించవచ్చు. అలాగే ఎండోమెట్రియల్‌ శాంపిల్‌ టెస్ట్, అవసరాన్ని బట్టి హిస్టెరోస్కోపీ కూడా చేయాల్సి రావచ్చు.

చికిత్స

వీలున్న మేరకు మందులతోనే సమస్యను నివారించేందుకు వైద్యులు ప్రయత్నిస్తారు.

కొందరికి గర్భాశయంలో అమర్చే మిరేనా గా చెప్పే 'లెవనార్జెట్రెల్‌ ఇంట్రా యూటరైన్‌ సిస్టమ్‌' అమర్చాల్సి రావచ్చు. ఇది రోజూ కొద్దికొద్దిగా 'లెవనార్జెట్రిల్‌' అనే ప్రొజెస్టరాన్‌ హార్మోన్‌ని విడుదల చేసి నెలసరి తక్కువయ్యేలా చూస్తుంది. ఐదేళ్లవరకూ పనిచేసే మిరేనాను కోరినప్పుడు అమర్చుకొని, వద్దనుకున్నప్పుడు తీసేసే వెసులుబాటు ఉంటుంది.

చికిత్సలతో సమస్య దారికి రానివారికి సర్జరీ చేసి గర్భాశయాన్ని తీసేయటం, అక్కడి ఎండోమెట్రియల్‌ పొరను కరిగించడం చేస్తారు.

నివారణ

అధికబరువు ఉన్నవారు పోషకాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువు తగ్గించుకోవాలి.

రక్తహీనత ఉంటే ఐరన్‌ మాత్రలు వాడటంతో బాటు రోజూ ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే బెల్లం, తోటకూర, గుడ్లు, ఎండుద్రాక్ష, సోయా వంటివి తీసుకోవాలి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE