చేతుల పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయటం వల్లే చేతి గోళ్లలో చేరిన బాక్టీరియా, పలు క్రిములు ఆహారంతో బాటు శరీరంలోకి చేరి పలు వ్యాధులకు కారణమవుతున్నాయి. అలాగే చేతి వేళ్ల రంగు, తీరులో వచ్చే మార్పులను గమనించకపోవటం వల్లే పలు అనారోగ్యాలను ముందుగా గుర్తించలేకపోతున్నాము. ఆరోగ్యానికి సంబంధించి చేతులు చేసే ముందస్తు సూచనల గురించి తెలుసుకుందాం. 

మునివేళ్ళల్లో మార్పులు

చేతి వేళ్లు నీలి రంగుకు మారితే రక్తప్రసరణ లోపాలున్నట్లు అనుమానించాలి. దీన్ని వైద్యపరిభాషలో 'రేనూడ్‌ సిండ్రోమ్‌' అంటారు.దీన్ని ముందే గుర్తించకపోతే కొన్నాళ్ళకు చేతివేళ్లు, అరికాళ్లు ఎర్రగా లేదా తెల్లగా మారటంతో బాటు మంట, దురదలు, జ్వరం కూడా ఉండొచ్చు. 

చేతులు వణకటం

నరాల బలహీనత, మానసిక ఆందోళన, కెఫిన్‌ ఎక్కువగా తీసుకోవటం, ఆస్తమా, మానసిక సమస్యలకు చికిత్స పొందేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. 

అరచేతుల్లో చెమటలు

కొందరికి తరచూ అరచేతుల్లో చెమట వస్తుంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువైనా లేక థైరాయిడ్‌ లోపాల వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ లక్షణం ఎక్కువకాలం కనిపిస్తుంటే తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించాలి.

 

గోళ్ళ తీరు మారితే

చేతి గోళ్ళు పాలిపోతే పోషకాహారలోపం, రక్తహీనత, కాలేయ, హృదయ సంబంధిత అనారోగ్యానికి గుర్తుగా భావించాలి. గోళ్లు పసుపు రంగులోకి మారితే ఫంగల్ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం ఉందేమోనని అనుమానించాలి.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE