• HOME
  • ఆరోగ్యం
  • మెరుగైన చికిత్సతో సయాటికా నుంచి విముక్తి

నడుము నుంచి పిరుదుల మీదుగా కాలు దిగువకు పాకుతూ ఉండే నొప్పినే 'సయాటికా' అంటారు. రోజువారీ దినచర్యను తీవ్రంగా ఇబ్బంది పెట్టే సయాటికా నొప్పి భరించలేని వేదనను కలిగిస్తుంది. నిజానికి ఇది వ్యాధి కాదు. కేవలం నడుము సమస్య లక్షణం మాత్రమే. ఏళ్ళ తరబడి ఇబ్బంది పెట్టే ఈ సమస్యకు ఇప్పుడు చక్కని చికిత్స అందుబాటులో ఉంది.

వివరాలు

శరీరంలో అన్నిటి కన్నా పెద్ద నరం సయాటికా. ఇది కింది వీపు భాగం నుంచి పిరుదుల మీదుగా కాలు వెనక భాగం గుండా పాదాల వరకు వెళుతుంది. ఈ నరం ఇతర ఐదు నరాల (ఎల్‌4, ఎల్‌5, ఎస్‌1,ఎ్‌స2,ఎస్‌3) సమూహాలతో ఏర్పడి ఉంటుంది. వెన్నుపూస లోపల నుంచి ప్రయాణించు నరాలపైన ఒత్తిడి వల్ల కాలు వెనక భాగం నొప్పికి గురవుతుంది. ఈ నొప్పి వీపు భాగంలో నుంచి పాదం వరకు ఉంటుంది. నొప్పితో బాటు తిమ్మిర్లు, స్పర్శ తగ్గిపోవడం, మంటలు, నడకలో మార్పు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కారణాలు

సాధారణంగా వయసు పైబడిన వారిలో వెన్నుపూసలోని డిస్కులు బలహీనపడి పక్కకు తొలగుతాయి. ఇలా జారిన డిస్క్ వెన్నుపూసలోకి వెళ్లే నరాన్ని ఒత్తిడికి గురిచేసి సయాటికా నొప్పికి దారితీస్తుంది. కొందరిలో ఎల్‌ 4, ఎల్‌ 5 నరాల రూట్స్‌ ఒత్తిడికి గురై తగిన భంగిమలో గాక పక్కకు జరిగినప్పుడు సయాటికా నొప్పి రావచ్చు. మరికొందరిలో ఎముకల రాపిడి వల్ల వెన్నుపూస ఒత్తిడికి లోనై నొప్పి వస్తుంటుంది. దెబ్బలు, గాయాల మూలంగా పైరిపార్శిస్‌ కండరము వాచి నరాలపై ఒత్తిడి పెరిగినా ఈ నొప్పి రావచ్చు. బొత్తిగా శారీరక శ్రమ, వ్యాయామం లేక కీలు సరిగ్గా పనిచేయని స్థితిలోనూ సయాటికా నొప్పి రావచ్చు. గర్భిణుల్లో పిండం బరువు పెరిగి వీపు నరాలపై ఒత్తిడి పడటం వల్ల కూడా సయాటికా నొప్పి వస్తుంది. చాలా అరుదైన కేసుల్లో, క్యాన్సర్‌ కణతి నరంమీద ఒత్తిడి పెంచటం వల్ల సయాటికా లక్షణాలు కనిపిస్తాయి.

లక్షణాలు

  • సూదులు, పిన్నులతో గుచ్చినట్లు అనిపించే నడుంనొప్పి ఉంటుంది. ఈ నొప్పి ఒకేవైపు పిరుదులు, కాళ్ళ భాగంలో నిలకడగా ఉంటుంది. అరుదుగా కొందరిలో కుడి, ఎడమవైపు కూడా ఉండొచ్చు.
  • పిరుదుల వద్ద మొదలయ్యే నొప్పి సయాటికా నరంతో సాగి తొడ, పిక్క, పాదాలకు వ్యాపిస్తుంది.
  • పడుకున్నా, నడిచినా ఉండని నొప్పి, నిలబడినా, కూచోన్నా వస్తుంది. కాలు మొద్దుబారటం, నడుము కండరాల వాపు, నొప్పి ఉంటాయి. కూర్చొని లేస్తే మరీ నొప్పి. కొంతసేపు నడిస్తే గానీ ఈ నొప్పి తగ్గదు.
  • నరాలు తెగిపోతున్న నొప్పి ఉంటుంది. ఒళ్ళు కదిలినా, చేత్తో తాకినా నొప్పి ఎక్కువవుతుంది.

చికిత్స

సయాటికా సమస్య తొలిరోజుల్లో వేడి నీటి కాపడం లేదా మంచుగడ్డను 20 నిమిషాలు నొప్పి ఉన్న భాగంపై పెడితే కాళ్లలో నొప్పి తగ్గుతుంది. దండాసనం వంటి వ్యాయామాలు, ఫిజియో థెరపీ ల సాయం తీసుకోవచ్చు. సమస్య ఇంకా కొనసాగితే పెయిన్‌ కిల్లర్స్‌, నడుములోకి ఇచ్చే ఇంజక్షన్‌ ద్వారా తగ్గించవచ్చు. దాదాపు 80శాతం మందికి ఇలా చేయటం ద్వారా నొప్పి తగ్గుతుంది. 6-12 వారాలు నొప్పి తగ్గక, తీవ్రంగా ఇబ్బందిపెడుతుంటే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.పరిస్థితి మరింత దిగజార్చినప్పుడే అరుదుగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE