శరీరంలో ఏదైనా కీలక అవయవం పనిచేయనప్పుడు లేదా తొలగించాల్సి వచ్చినప్పుడు అవయవదానం అవసరమవుతుంది. అంటే మరొకరి శరీరం నుంచి సేకరించిన అవయవాన్ని బాధితుడికి అమర్చటం అన్నమాట. అయితే ధార్మిక విశ్వాసాలు, భయం వంటి కారణాల వల్ల నేటికీ తగినంత సంఖ్యలో అవయవ దానానికి ముందుకొచ్చేవారి సంఖ్య బాగా తక్కువగా ఉంటోంది. ఒకవేళ వచ్చినా.. తగిన స్థితిలో ఉండే అవయవం లభించకపోవటం వంటి ఇబ్బందులూ ఎక్కువే. ఈ పరిస్థితిని నివారించాలంటే సమాజంలో అవయవదానం పట్ల అవగాహన పెంచటమే ఏకైక మార్గం.

అవయవదానం వివరాలు

ఒక వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయితే అతని కీలక అవయవాలను అంటే.. 2 కళ్ళు, 2 మూత్రపిండాలు, 2 ఊపిరితిత్తులు, గుండె, క్లోమం, కాలేయాన్ని దానం చేసి ఒక్కొక్కరికి ఒక్కో అవయవాన్ని అమర్చగలిగితే 9 మందికి కొత్త జీవితాన్ని అందించవచ్చు. అయితే ఒక వ్యక్తి శరీరం నుంచి తీసిన అవయవాన్ని నిర్దిష్ట సమయంలో అమర్చితేనే ఫలితం ఉంటుంది. ఉదాహరణకు.. గుండెను 4 గంటల్లో, కాలేయాన్ని 8 గంటల లోపు, మూత్రపిండాలను 24 గంటలలోపు అమర్చాల్సి ఉంటుంది.   

బ్రెయిన్ డెడ్ అయినా వ్యక్తి నుంచి అవయవాలు సేకరిచేటప్పుడు ఒక్కో అవయవాన్ని తీస్తూ.. చివరగా గుండెను తీస్తారు. అలాగే మరో వ్యక్తికి అమర్చేటప్పుడు మాత్రం ముందుగా గుండెను అమర్చిన తర్వాతే ఇతర అవయవాలను అమర్చాల్సి ఉంటుంది. 

బ్రెయిన్ డెడ్ తర్వాత చేసే అవయవదానాన్ని ‘కెడావరిక్ డొనేషన్’ అనీ, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నుంచి అవయవాలను సేకరిస్తే దాన్ని ‘లివింగ్ డోనర్ డొనేషన్’ అంటారు. ‘కెడావరిక్ డొనేషన్స్’ సంఖ్య పెరిగితే, ‘లివింగ్ డోనర్ డొనేషన్స్’ అవసరం తగ్గుతుంది. పైగా లివింగ్ డోనర్ డొనేషన్స్‌లో 2 శస్త్ర చికిత్సలు అవసరం. అదే.. కెడావరిక్ డొనేషన్ లో ఒకే సర్జరీ. రెండో వ్యక్తికి రిస్క్ ఉండదు. 

మన శరీరంలో బతికినంత కాలం పెరిగే అవయవం కాలేయం (లివర్) మాత్రమే. దీని మార్పిడి చికిత్స కాస్త కష్టమైనదే గాక ఖర్చుతో కూడినది. అవసరమైనప్పుడు తగిన కాలేయం నుంచి కొంత భాగాన్ని దానం చేయవచ్చు. కాలేయంలో ఉండే 8 భాగాలకు ఒక్కోతీరులో రక్తప్రసరణ జరుగుతుంది గనుక చాలా జాగ్రత్తగా చేస్తారు. రెండు నెలల్లో ఇద్దరి కాలేయాలూ పూర్తి స్థాయికి పెరుగుతాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE