అందంతో బాటు ఆరోగ్యం కావాలనుకునేవారు దంత పరిరక్షణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. దంత వైద్యులు చెప్పేదాని ప్రకారం మెరుగైన దంత ఆరోగ్యం కోరుకునే వారంతా రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి . అయితే దంత సంబంధిత అంశాల విషయంలో అవగాహనా లోపం, సమాజంలో ఉన్న అపోహల కారణంగా తీవ్రమయ్యే    వరకూ నిర్లక్ష్యం  చేస్తుంటారు. ఈ పరిస్థితిని నివారించి అందరూ దంతాల ఆరోగ్యానికి సంబంధించిన  అంశాల మీద సరైన అవగాహనను పెంచుకోవాలి .

అపోహ : రాలిపోయిన, విరిగిపోయిన దంతం మళ్ళీ వస్తుంది.

వాస్తవం: ఇది కేవలం పాలపళ్ళకే వర్తించే విషయం. ఒకసారి పాలపళ్ళ స్థానంలో శాశ్వత దంతాలు వచ్చాక అవి విరిగినా, ఊడినా అక్కడ మళ్ళీ పన్ను వచ్చే అవకాశం లేనే లేదు . ఆ సమస్యకు ఏకైక ప్రత్యామ్నాయం మళ్ళీ పన్ను కట్టించుకోవటమే. ఇప్పటి రోజుల్లో అందుబాటులో ఉన్న పలు ఆధునిక చికిత్సా విధానాల సాయంతో ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపొచ్చు.  అదే సమయంలో ఈ అవసరం రాకుండా తగిన జాగ్రత్తలూ తీసుకోవాలి. మరీ ముఖ్యంగా చిన్నారులు, యువత ఆటలు ఆదేసమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి .

అపోహ : దంతాలకు స్కేలింగ్ చేయించుకుంటే వాటి మధ్య సందులు ఏర్పడతాయి.

వాస్తవం: దంతాల చుట్టూ చేరి అక్కడే ఉండిపోయిన ఆహార పదార్ధాలు, పేరుకు పోయిన పాచి తదితరాలు రోజూ బ్రష్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తొలగిపోతాయి. దంతాల పరిశుభ్రతను  నిర్లక్ష్యం చేసిన వారిలో  ఈ వ్యర్ధాలు అక్కడే నిలిచిపోయి పసుపు పచ్చని పొరగా ఏర్పడిపోతాయి. వీటిని తొలగించే ఏకైక విధానం  స్కేలింగ్. ఈ పద్దతిలో దంతం చుట్టూ , గట్టిగా ఏర్పడిన పొరను యంత్రం సాయంతో తొలగిస్తారు . ఈ క్రమంలో అక్కడ చేరిన వ్యర్దాలన్నీ తొలగిపోయి, దంతాల మధ్య కొంచం ఖాళీ ఏర్పడినట్లు కనిపిస్తుంది . అయితే  ఇది అవగాహనా లోపం వల్ల ఏర్పడే అపోహ మాత్రమె. అయితే నిపుణుడైన దంత వైద్యుడి వద్దే స్కేలింగ్ చేయించుకోవాలి .

అపోహ : పాల దంతాలు ఎలాగూ రాలిపోతాయి గనుక వాటికి ప్రత్యేక సంరక్షణ అవసరం లేదు .

వాస్తవం: పాల దంతాల కిందే శాశ్వత దంతాలు వస్త్తాయి. పాల దంతాలు సహజ సిద్దంగా ఊడిపోతే ఫరవాలేదు గానీ గాయాలు, ప్రమాదాల వల్ల ఊడితే ఆ ప్రభావం కింద వుండే శాశ్వత దంతాల మీద తప్పక పడి వాటి రూపం, పరిమాణాల్లో కొద్దిపాటి మార్పులు వస్తాయి. అందుకే పాలపల్ల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.

అపోహ : చక్కెర ఎక్కువగా తింటే దంతాలు దెబ్బతింటాయి

వాస్తవం: చక్కెర తినటం వాళ్ళ దంతాలు పాడు కావటం ఉండదు. అయితే చక్కెర లేక తీపి పదార్థాలు తిన్న తర్వాత నోటిని శుభ్రంగా పుక్కిలించక పోవటం  వల్ల దంతాల మీది బాక్టీరియా అక్కడ చేరిన చక్కెరతో కలిసి కొన్ని ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది . ఇవే దంతాలు గుంటలు పడటానికి , ఆరిగిపోవటానికీ ప్రధాన కారణం. అందుకే తీపి తిన్న తర్వాత బద్దకించకుండా దంతాలు నీటితో పుక్కిలించాలి .

అపోహ : ఎంత సమయం బ్రష్ చేస్తే దంతాలు అంతగా మెరుస్తాయి

వాస్తవం:  అది పూర్తిగా అపోహే. అతిగా బ్రష్ చేయటం వల్ల దంతాలు మెరవక పోగా ఊహించనంతగా దెబ్బతింటాయి. ఇలా చేయటం వల్ల దంతాల మీది పల్చని పింగాణీ వంటి ఎనామిల్ పొర, చిగుళ్ళు దెబ్బతినే ముప్పు ఎక్కువ. అందుకే క్రమబద్ధ మైన రీతిలో రెండు నుంచి మూడు నిమిషాల పాటు బ్రష్ చేస్తే చాలు . 

అపోహ : దంతాలలోని రంధ్రాల వాళ్ళ ఎలాంటి ఇబ్బందీ తలెత్తదు. 

వాస్తవం:  దంతాల మీద ముదురు గోధుమ రంగులో ఏర్పడిన మచ్చలు క్రమంగా రంధ్రాలుగా మారి, దంత మూలంలోకి చొచ్చుకుపోతాయి. దీనివల్ల రూట్ కెనాల్ చికిత్స చేసి దంతాన్ని కాపాడాల్సి రావటం, పూర్తిగా పంటిని తీసేయాల్సి రావచ్చు. అందుకే ఇలాంటి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE