ప్రప౦చ౦లో సుమారు 50 కోట్లమంది పలు రకాల మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. వీరిలో సగానికి పైగా మహిళలే. చాలామంది గుర్తించలేరు గానీ ప్రతీ నలుగురిలో ఒకరు జీవిత౦లో ఏదో ఒకసారి ఏదో ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. మానసిక వ్యాధుల్లో ఎక్కువమ౦దిని వేధించేది డిప్రెషన్‌ కాగా స్కిట్సొఫ్రెనియా, బైపోలార్‌ డిజార్డర్‌ వంటివి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పిచ్చివాళ్లుగా ముద్ర వేస్తారనే భయంతో ఇప్పటికీ చాలామంది మహిళలు తమ మానసిక వ్యాధుల గురించి బయటకు చెప్పకుండా మౌనంగానే భరిస్తున్నారు. దీంతో వారికి సరైన వైద్య సహాయ౦ అ౦దట్లేదు. ఏటికేడు మహిళల్లో ఈ తరహా సమస్యలు పెరుగుతున్నట్లు మన జాతీయ గణాంకాలు వెల్లడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాజంలో ఈ సమస్య పట్ల స్పష్టమైన అవగాహన పెంపొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మహిళలకు అటు కుటుంబం, ఇటు సమాజం నుంచి పూర్తి సహకారం, మద్దతు ఎంతైనా అవసరం. అయితే.. మహిళా సాధికారత కోరుకొనే మన సమాజం ఇప్పటికీ జనాభాలో సగం ఉన్న మహిళల మానసిక సమస్యలను అర్థం చేసుకోవటానికి చొరవ చూపాల్సిన సమయమిది. 

తన చుట్టూ ఉన్న పురుషాధిక్య సమాజపు ప్రభావాన్ని తగ్గించి తన వ్యక్తిత్వానికి అనుగుణంగా నడుచుకొనేందుకు ఆధునిక మహిళ తప్పక ప్రయత్నించాలి. ఈ క్రమంలో తన విద్య, నైపుణ్యం, అనుభవాలను వినియోగించుకోవాలి. తన భావాలను నలుగురితో ధైర్యంగా వెల్లడించాలి. అప్పుడే ఆమె మానసిక ఒత్తిళ్లు సగం దూరమవుతాయి. 

ప్రతి ఒక్కరూ బాలికలను చిన్నప్పటి నుంచి సొంతగా ఆలోచించేలా, నిర్ణయాలు తీసుకొనేలా ప్రోత్సహించాలి. ఏ విషయంలోనే లింగ వివక్ష చూపించకూడదు. ఇంటిపనులతో బాటు బయటిపనుల్లోనూ బాలికలను భాగస్వాములను చేయాలి. దీనివల్ల స్త్రీ పురుషులు ఎవరు ఏ పనైనా చేయగలరని, చేయొచ్చని పిల్లలు నేర్చుకొంటారు.

సాధారణంగా మహిళలు పనిపాటల్లో పడి తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. మహిళల భావోద్వేగాలను పంచుకొనే వాతావరణం లేనప్పుడు , మానసిక సమస్యల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే మహిళలు రోజులో కొంత సమయాన్ని తమకు ఇష్టమైన పనులు, వ్యాపకాల కోసం కేటాయించాలి. ఈ విషయంలో ఇతర కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకం. 

మహిళ వృత్తిపరమైన, కుటుంబ పరమైన, సామాజిక బాధ్యతలను ఒకే సమయంలో నిర్వర్తిస్తుంది. ఈ క్రమంలో తన అభిరుచులు , ఇష్టాయిష్టాలకు సమయం మిగలటం లేదు. ఈ పరిస్థితిని నివారించి సంతోషంగా, తృప్తిగా జీవించేలా ప్రతిమహిళా తన సమయాన్ని విభజించుకోవాలి. 

మానసిక సమస్యల ముప్పు తగ్గాలంటే మహిళలు దేహ దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలి.పురుషులతో పోల్చినప్పుడు మహిళలు సామాజిక, భావోద్వేగాలను ఎక్కువగా మోస్తున్నారు. అందుకే మహిళల్లో మెదడు ఎక్కువగా అలసిపోతుంది. దీనివల్ల ఙ్ఞాపకశక్తి తగ్గటం, హార్మోన్ల అసమతుల్యత, పెరినాటల్‌ డిప్రెషన్‌, ప్రీమెనుస్ట్రువల్‌ డిస్ఫోరిక్‌ డిజార్డర్‌, పెరిమెనోపాజ్‌ వంటి సమస్యలు వస్తుంటాయి. 

మన దేశంలో 16 నుండి 50 శాతం వరకూ స్త్రీలపై పలు రకాలుగా హింస జరుగుతోంది. ప్రతి ఐదుగురిలో ఒక మహిళ జీవితంలో కనీసం ఒక్కసారైనా అత్యాచారానికిగానీ, అత్యాచార యత్నానికిగానీ గురవుతోంది. దీనివల్ల వారిలో ఒత్తిడి పెరిగి, జీవితంలో స్థిరత్వాన్ని కోల్పోతారు. 

రుతుస్రావం, హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి అంశాలే మహిళల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలనే అపోహలను పక్కన బెట్టివారిని కుంగదీస్తున్న సామాజిక ప్రభావాల నుంచి వారిని బయటపడేయాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE