గతంలో సౌకర్యాలు, విలాసాలుగా చెప్పుకొన్న అనేక ఉపకరణాలు నేడు రోజువారీ అవసరాలుగా మారాయి. వాటిలో ఏసీ కూడా ఒకటి. ఇప్పటి రోజుల్లో ప్రతి మధ్య తరగతి ఇంటిలోనూ ఏసీ కనిపిస్తోంది. కార్యాలయాలు, పరిశ్రమలు, వాహనాలలోనూ ఏసీ వినోయోగం ఎక్కువయ్యింది. ఆదాయాలతో బాటు  పెరుగుతున్న  ఉష్ణోగ్రతలు, కాలుష్యం,  తేమ, రుతుకాలాల్లో వస్తున్న అనుకోని మార్పులు కూడా ఏసీల వినియోగాన్ని పెంచుతున్నాయి. వేసవిలో అయితే ఏసీ లేకుండా ఉండలేమనే భావన. ఇటీవలికాలంలో  గ్రామాల్లోనూ  వీటి వినియోగం పెరుగుతోంది. అయితే ఏసీ వినియోగం, పనితీరు వంటి అంశాలను సరిగా అవగాహన చేసుకొని అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పలు శ్వాస కోశ సమస్యల బారిన పడే అవకాశం ఉంది.

ముక్కు, ఊపిరితిత్తుల పాత్ర

ఏసీ ప్రభావానికి ముందుగా ముక్కు, ఊపిరి తిత్తులు గురవుతాయి. వాతావరణంలోని వేదిగాలిని చల్లబరచి ఊపిరితిత్తులకు అందించటమే ముక్కు పని. ఒకవైపు సహజసిద్ధమైన ఏసీ మాదిరి పనిచేస్తూనే ముక్కులోని సూక్ష్మమైన వెంట్రుకలు గాలిలోని దుమ్ము, ధోలి కణాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంటాయి. జలుబు చేసినప్పుడు ఈ రెండు పనులు ఆగిపోవటంతో అసౌకర్యంగా అనిపిస్తుంది. ముక్కుద్వారా అందిన గాలిలోని ప్రమాదకరమైన వాయువులను ఊపిరితిత్తులు మరోమారు వడపోసి అందులోని ఆక్సిజన్ ను రక్తానికి అందిస్తాయి. అదే సమయంలో గాలితో బాటు చేరే దుమ్ము, ధూళి కణాలను తుమ్ము, దగ్గుల రూపాల్లో బయటికి పంపుతాయి.   ఒక రకంగా ఈ రెండు వయవాలు చేసే పనినే ఏసీ కూడా చేస్తుంది. ఏసీ లోని అత్యాధునిక ఫిల్టర్లు ఒకవైపు గాలిలోని ధోలి కణాలతో బాటు బాక్టీరియా వంటి కణాలను వడపోసి మంచి గాలిని అందిస్తూనే, మరోవైపు గాలిలోని తేమను, ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాయి. అల్లా విడుదలయ్యే గాలి నేరుగా మన ఊపిరి తిత్తుల్లోకి చేరుతుంది.

ఏసీ వినియోగం... జాగ్రత్తలు

  • చల్లని గాలికోసం ఏసీ వాడే మాట నిజమే అయినా మరీ తక్కువ ఉష్ణోగ్రతలు పనికిరావు. ఉష్ణోగ్రత తగ్గేకొద్దీ ఫంగస్ తో బాటు పలు క్రిములు వృద్ధి చెంది గాలితో బాటు ఊపిరితిత్తులలోకి చేరి తుమ్ములు, శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుంది. ఈ పరిస్థితినే వైద్య పరిభాషలో ' హైపర్ సెన్సిటివిటీ' అంటారు. ఈ పరిస్థితిని నివారించేందుకు ఎప్పటికప్పుడు ఏసీలలోని కండెన్సర్ , కాయిల్స్ లను పరీక్షించి ఏమైనా మరమ్మతు అవసరమైతే చేసుకోవాలి. బయటి వాతావరణానికి కాస్త అటూ, ఇటూగా ఉష్ణోగ్రతలు ఉండేలా చూసుకుంటే మంచిది.
  • ఏసీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, పరితీరు లోపాలుంటే వెంటనే సరిచేస్తుండాలి. లేకపోతే ఏసీ ఫిల్టర్ ల వద్ద చేరిన దుమ్ము, ధూళి కారణంగా గాలి నాణ్యత బాగా తగ్గుతుంది. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే ఊపిరితిత్తుల సమస్యలు తప్పవు. ఏసీ ఉన్న గదిలో కనీసం ఒక్క కిటికీ అయినా ఉండాలి. అన్నివైపులా మూసిన గది వెంటనే చల్లబడినా గాలి నాణ్యత అనుకున్నంత గొప్పగా ఉండదు. అందుకే ఏసీ ఉన్న గది తలుపులు లేక కిటికీలు నాలుగు గంటలు ఒకసారైనా తీసి తాజా గాలి వచ్చేలా చూడాలి.
  • ఏసీ నుంచి వచ్చే చల్లని గాలిని మోసుకెళ్ళే గోత్తలనూ సర్వీసింగ్ సమయంలో శుభ్రం చేయాలి. లేకపోతే ఏసీ మీద ఒత్తిడి పెరిగి, ఎక్కువ విద్యుత్తు ఖర్చవుతుంది. గాలిని చల్లబరించేందుకు ఏసీలో వాడే ఘాటైన కూలెంట్ లిక్విడ్ ను పొరబాటున కూడా వాసన చూడరాదు. ఘాటైన వాసన పీల్చితే ఒక్కసారి శ్వాస ఆగినట్టు అనిపించి, ఉక్కిరి బిక్కిరి అవుతారు.
  • ఇంట్లో ఎసీలతో పోల్చితే కారులోని ఏసీ వాళ్ళ ముప్పు ఎక్కువ.ఈ ప్రభావం ముందు సీట్లో కూర్చునేవారికి మరింత ఎక్కువ. అందుకే అవసరమైనప్పుడు ఏసీ వాడి మిగిలిన సమయంలో ఆపాలి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE