గడచిన దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా శాకాహారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అదే సమయంలో మాంసాహారంతో బాటు పక్షుల, జంతువుల నుంచి సేకరించిన ఏ ఉత్పత్తినీ వాడకపోవటమనే వాదమూ పలు అభివృద్ధి చెందిన దేశాల్లో పెరుగుతూ వచ్చింది. దీనినే వేగానిజం అనీ, ఈ సిద్ధాంతాన్ని పాటించేవారిని 'వేగాన్స్' అనీ అంటారు. అహింసే ప్రాతిపదికగా వచ్చిన ఈ సిద్ధాంతం అత్యుత్తమ మానవతా నియమంగా ఆయా దేశాల్లో ప్రాచుర్యంలోకి వచ్చింది. జీవకారుణ్యం గురించి ‘పెటా’ వంటి సంస్థల ప్రచారం కూడా దీనికి తోడవటంతో వేగాన్స్ సంఖ్య మరింత వేగంగా పెరుగుతోంది. వ్యక్తిగత, మతపరమైన కారణాలను పక్కనబెట్టి మనుషులంతా దీన్ని పాటిస్తే మనిషి ఆరోగ్యం, మన ప్రకృతి రెండూ బాగుంటాయని వేగాన్స్ సూచిస్తున్నారు. వేగాన్స్ మాంసంతో బాటు పాలు, తేనె వంటివి కూడా తినరు. అలాగే జంతు చర్మాలతో చేసిన బెల్టులు, హ్యాండ్‌ బ్యాగ్‌లు, తోలు చెప్పులు వంటివీ వాడకపోవటమే గాక వాటి వినియోగాన్నీ నిరుత్సాహపర్చేలా ప్రచారాన్ని చేయటంతో ఇటీవలికాలంలో మన దేశంలోనూ వీరి సంఖ్యా పెరుగుతోంది. ఏటా నవంబర్ 1న 'వరల్డ్ వేగాన్స్ డే' పేరిట ఈ అంశాల పట్ల అవగాహన కల్పించే దిశగా పలు సంస్థలు కృషిచేస్తున్నాయి.

 

మాంసాహారం ఎందుకొద్దు?  

  • మాంసాహారంలో ఆర్థరైటిస్‌, ఫైబ్రో మయాల్జియా కారక ఎండోటాక్సిన్స్‌ అధికం. పైగా మాంసాహారం తీసుకునే దేశాలవారు ఇప్పటికే గుండెజబ్బులు, టైప్‌- 2 మధుమేహం, కేన్సర్‌ వ్యాధుల బారిన ఎక్కువగా పడుతున్నారు. వీరు వేగాన్స్ గా మారితే ఆయుప్రమాణాలు మెరుగుపడటంతో బాటు మరణాల రేటు, ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.
  • కిలో మాంసం వినియోగదారుడికి అందాలంటే దాదాపు 15 వేల లీటర్ల నీరు కావాలి. ఇదిలా సాగితే కొన్నాళ్ళకు నీటి కొరత తప్పదు.
  • మాంసం కోసం జంతువులను పెంచటం, మాంస శుద్ధి, మాంస వ్యర్ధాల నిర్వహణలు కాలుష్యానికి దారి తీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహారం మూలంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో.. మాంసం ఉత్పత్తి కారక ఉద్గారాలు 80 శాతంగా ఉన్నాయి.
  • కొన్ని జంతువులు ఎక్కువ ఆహారం తీసుకొని తక్కువ మాంసాన్ని ఇస్తాయి గనుక ఇది లాభసాటి కాదు.
  • మెజారిటీ ప్రజలు వేగాన్స్ అయితే కర్బన ఉద్గారాలు తగ్గి ప్రజలకు మరింత మెరుగైన జీవన ప్రమాణాలు పొందుతారు. 

వేగాన్ డైట్ మేలు

  • సకల పోషకాలున్న వేగాన్ డైట్ సాయంతో గుండెజబ్బులు, క్యాన్సర్‌, ఆర్థరైటిస్‌ వంటి రోగాలను గణనీయంగా నివారించవచ్చు.
  • వేగాన్ డైట్ లో శాచురేటెడ్‌ ఫాట్స్‌ తక్కువగానూ, పీచు అధికం. పైగా కాన్సర్‌ ను నివారిం చే ఫైటోన్యూట్రియంట్స్‌ అధికం. వేగాన్ డైట్ తీసుకొనే వారికి అధిక బరువు సమస్య ఉండదు.
  • గింజలు, పప్పుధాన్యాలు తీసుకోవటం ద్వారా ప్రొటీన్లు, ఆకు కూరలు, కూరగాయలు, మొలకెత్తిన విత్తనాల ద్వారా విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి సూక్ష్మ పోషకాలు లభిస్తాయి . ఇక .. పశువుల పాలకు బదులుగా సోయా పాలు తీసుకోవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE