చలికాలంలో సైనసైటిస్ బెడద తీవ్రంగా వేధిస్తుంది. ప్రతి మనిషి తన జీవనకాలంలో ఒక్కసారైనా దీని బారిన పడుతుంటాడు. దీర్ఘకాలీక సమస్య అయినా సైనసైటిస్ బాధితులు తగిన చికిత్స తీసుకొంటూనే దాని ప్రభావాన్ని గణనీయంగా తగ్గించే కొన్ని జాగ్రత్తలు , చిట్కాలు పాటించటం ఎంతైనా అవసరం. అవి..

జాగ్రత్తలు

 • తరచుగా నోటిని గోరువెచ్చని నీటితో పుక్కిలించటం,
 • ఇంటి లోపల, పరిసరాల్లో దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవటం
 • ఎక్కువ సమయం ఈత కొట్టకుండా ఉండటం
 • చానీటికి బదులు గోరువెచ్చని నీటితోనే స్నానం చేయటం
 • చల్లటి పదార్ధాలకు దూరంగా ఉండటం,
 • చలిగాలికి బయటికి వెళ్ళేటప్పుడు చెవిలో దూదిపెట్టుకోవడం,
 • బయటినుంచి రాగానే ఆవిరిపట్టడం
 • రోజూ బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేయడం 

ఆయుర్వేద చిట్కాలు

 • చెంచా జీలకర్రను వేయించి పొడిచేసి అరచెంచా చొప్పున ఉదయం, సాయంత్రం 2 చెంచాల తేనెతో కలిపి తినాలి.
 • చెంచా వేయించిన జీలకర్రను నలిపి పల్చని రుమాలులో మూటగట్టి గట్టిగా వాసన పీల్చాలి.
 • పావులీటరు నీటిలో చెంచా మెంతులు వేసి మరిగించి ఆ కషాయాన్ని రోజుకు నాలుగు సార్లుగా తీసుకోవాలి.
 • 300 మి. లీ క్యారట్ రసం, 200 మి. లీ పాలకూర రసం కలిపి రోజుకోసారి తాగినా మంచి గుణం కనిపిస్తుంది.
 • ఆహారంలో తప్పనిసరిగా ఉల్లి, వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE