ఉదయం నిద్రలేవగానే తగినన్ని మంచినీళ్లు తాగటం ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అలవాటు పలు అనారోగ్యాలనూ దూరం చేస్తుందని వారు సూచిస్తున్నారు. పరగడుపునే కొద్దిపాటి వ్యవధితో కనీసం లీటరు నీరు తాగి, మరో గంటవరకు ఏ ఆహారం తీసుకోనివారు చక్కని ఆరోగ్యవంతులుగా ఉంటారని పలు పరిశోధనలూ స్పష్టం చేస్తున్నాయి. ఈ అలవాటు వల్ల శరీరంలో కలిగే మార్పుల వివరాలు... 

  • ఉదయం సమయాన జీర్ణాశ‌యం విశ్రాంతి స్థితిలో ఉండటమేగాక ఎలాంటి ర‌సాలు విడుద‌ల కావు. ఆ స‌మ‌యంలో తగినన్ని నీళ్లు తాగ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యం మొత్తం శుభ్ర‌మ‌వుతుంది. అలాగే పెద్ద పేగు కూడా శుభ్రపడి, దాని పనితీరు మెరుగౌతుంది. దీనివల్ల అది మరింత సమర్ధవంతంగా పోషకాలను గ్రహిస్తుంది.
  • రక్తంలోని మలినాలు తొలగిపోయి రక్త శుద్ధి జరగుటమే గాక కొత్త రక్తకణాల వృద్ధి సరిగా జరుగుతుంది. ఇది కండరాల వృద్ధికి దారితీస్తుంది.
  • పరగడుపున నీరు తాగేవారికి గొంతు సమస్యలు, జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల బెడద చాలా తక్కువ.
  • ఉదయాన్నే నీరు తాగేవారికి మలబద్ధకమనే సమస్యే ఉండదు.
  • పరగడుపునే క్రమం తప్పక నీరు తాగేవారి శరీర జీవక్రియలు ఊపందుకొంటాయి. దీనివల్ల చక్కని ఆరోగ్యం, ఉల్లాసం సమకూరుతాయి.
  • రక్తం, శరీరంలోని వ్యర్ధాలు తొలగిపోవడంతో శరీర ఛాయ మెరుగుపడుతుంది.
  • రాత్రి నిద్ర మూలంగా సుమారు 6 గంటలపాటు నీరు తీసుకోము గనుక ఉదయాన్నే తాగే నీరు శరీర అవసరాలను తీర్చగలుగుతుంది.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE