ఈ రోజుల్లో అత్యంత సాధారణ అనారోగ్య సమస్యల్లో మధుమేహం ఒకటి. ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపుటలవాట్లతో బాటు నిపుణులు సూచించే కొన్ని జాగ్రత్తలు పాటించగలిగితే మధుమేహం ఎన్నటికీ ఇబ్బంది పెట్టదు. అయితే ఈ విషయంలో తగిన అవగాహన లేకపోవటం మూలంగా అది పలు ఇతర అనారోగ్యాలకు దారితీసి చివరికి ప్రాణాంతకంగా మారుతోంది. అందుకే మధుమేహులు తప్పనిసరిగా సమస్యపట్ల తగిన అవగాహనను పెంచుకోవటంతో బాటు పాదాలు,కిడ్నీలు, గుండె, నరాల మీద దాని ప్రభావం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి. 

అదుపులో పెట్టటం ఎలా

 • రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి. బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలి. ముందు నుంచే వ్యాయామం చేసేవారికి మధుమేహం ముప్పు గణనీయంగా తగ్గుతుందని గ్రహించాలి.
 • వేళకు ఆహారం తీసుకోవటం, సమయానికి మందులు వేసు తీసుకోవటం మరువొద్దు. దీనివల్ల బరువు అదుపులో ఉంటుంది.
 • ఇన్సులిన్‌ తీసుకొనే వారు సమయానికి దాన్ని తీసుకోవటం మరువొద్దు.
 • మధుమేహులు పాదరక్షలు లేకుండా నడవకూడదు. పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, ఆనెలు ఉంటే చికిత్స తీసుకోవాలి. పాదాలను రోజూ పాదాలను గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.ముఖ్యంగా స్పర్శ ఎలావుందో పరీక్షించుకోవాలి. స్పర్శ తెలియకపోతుంటే 6 నెలలకోసారి పరీక్ష చేయించాలి.
 • గోళ్లు తీసే క్రమంలో చిగురు గాయం కాకుండా చూసుకోవాలి.
 • ఇన్‌ఫెక్షన్ల మూలంగా కాళ్లకు చీము పడితే నిర్లక్ష్యం చేయొద్దు. డాక్టర్‌ సలహాతో యాంటీబయాటిక్స్‌, అవసరమైతే ఇన్సులిన్‌ తీసుకోవాలి.
 • మధుమేహం తీవ్రత ఎక్కువగా ఉన్నవారు అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, నేత్ర పరీక్షలు కూడా డాక్టర్‌ సలహా మేరకు చేయించుకోవాలి
 • మధుమేహులకు కిడ్నీ సమస్యల బెడద ఎక్కువ. దీంతో మూత్రంలో ఆల్బుమిన్‌ అనే ప్రొటీన్‌ విసర్జించబడి అంతిమంగా కిడ్నీ దెబ్బ తినడానికి దారి తీస్తుంది. అందుకే వీరు ప్రతి మూడు నెలలకోసారి మూత్ర పరీక్ష చేయించుకోవాలి.
 • మధుమేహుల్లో గుండె రక్తనాళాలు మూసుకుపోయే ముప్పు ఎక్కువ గనుక వీరు గుండె నొప్పి ఉన్నా లేకున్నా ఏటా ఇసిజి, ట్రెడ్‌మిల్‌ పరీక్షలు, కొలెస్ట్రాల్‌ పరిమాణాన్ని తెలిపే లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలు చేయించాలి. వీరు కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండే కొవ్వు ఉన్న మాంసం, గుడ్లు తినడం మానుకోవాలి.
 • ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
 • తీపి పదార్థాలు, ఐస్‌క్రీములు తినరాదు. ఏదైనా విందుకు హాజరైన రోజు రాత్రి భోజనం పరిమితం చేసుకోవాలి. నూనె పదార్థాలు కూడా బాగా తగ్గించాలి.
 • కొన్నిసార్లు శరీరంలో చక్కెర శాతం హఠాత్తుగా పెరిగి మాత్రలతో అదుపు కానప్పుడు డాక్టర్‌ సలహాపై ఇన్సులిన్‌ తీసుకోవాలి. ఆ తరువాత చక్కెర అదుపులోకి వచ్చాక మళ్లీ మాత్రలు వాడొచ్చు. ఒకసారి ఇన్సులిన్‌ తీసుకుంటే జీవితాంతం తీసుకోవలనేది కేవలం అపోహే అని గుర్తించాలి.
 • ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి.

                                                                                    ప్రపంచ మధుమేహ దినోత్సవం (నవంబర్ 14) సందర్భంగా...Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE