• HOME
  • ఆరోగ్యం
  • ల్యాప్‌టాప్‌ తెచ్చే ఆరోగ్య సమస్యలు

   ఇప్పుడు ల్యాప్‌టాప్‌ వాడకం బాగా పెరిగింది. ఎక్కడైనా కూర్చొని పనిచేసే వెసులుబాటు, కోరుకున్న తీరుగా కూర్చొనే వెసులుబాటు ఉండటంతో  యువత గాడ్జెట్స్ జాబితాలో ఇది తప్పనిసరిగా ఉంటోంది. అయితే ఇష్టమొచ్చిన భంగిమల్లో కూర్చొని గంటల తరబడి  ల్యాప్‌టాప్‌ వాడే వారిలో పలు అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ల్యాప్‌టాప్‌ వాడేవారు కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిది. అవి.. 

  • ల్యాప్‌టాప్‌లను ఎక్కువమంది ఒడిలో పెట్టుకొని ముందుకు వంగి కూర్చొని గంటల తరబడి పనిచేస్తుంటారు. దీనివల్ల వెన్నుపూస మీద తెలియని భారం పడి వెన్నునొప్పి రావచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇది క్రమంగా స్పాండిలైటిస్‌కు దారితీస్తుంది. ఈ పరిస్థితిని నివారించాలంటే తగిన ఎత్తున్న టేబుల్ మీద ల్యాప్‌టాప్‌ పెట్టి వాడాలి.
  • ల్యాప్‌టాప్‌ నుంచి సుమారు 52 సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వెలువడుతుంది. ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకోవటం వల్ల ఆ వేడికి వీర్యం నాణ్యత తగ్గి ఆ ప్రభావం సంతాన సాఫల్యత మీద పడుతోంది. అందుకే యువత ల్యాప్‌టాప్‌ ను పొరబాటున కూడా ఒడిలో పెట్టుకోవద్దు. ల్యాప్ టాప్ ఒడిలో పెట్టుకోవాల్సివచ్చినప్పుడు ఒడిలో మెత్తని దిండు వేసుకొని దానిమీద పెట్టుకోవాలి.
  • ల్యాప్‌టాప్‌ మీద పనిచేసేటప్పుడు ఎదురుగా లైట్‌ ఉండకుండా చూసుకోవాలి. లేకుంటే ఆ కాంతి ప్రభావానికి కళ్ళు పొడిబారటం, నీళ్లు కారటం వంటి సమస్యలు వస్తాయి.
  • ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ కు ముఖం దగ్గరగా పెట్టి ఎక్కువ సమయం చూడటం వల్ల కళ్ళు తీవ్ర ఒత్తిడికి లోనై 'కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌' అనే నేత్ర సమస్య వస్తుంది. కనుక స్క్రీన్ ను తగిన దూరం నుంచి చూడాలి. అవసరాన్ని బట్టి యాంటీ గ్లేర్ కళ్లద్దాలు వాడాలి. 
  • రోజంతా ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని పనిచేసేవారికి తొడ భాగంలో చర్మ సమస్యలు రావచ్చు. కొందరిలో ఇది చర్మ క్యాన్సర్‌కి దారి తీసే ప్రమాదం ఉంది. కనుక ఒడిలో పెట్టుకోవద్దు.
  • ల్యాప్‌టాప్‌ ఇరుకైన కీ బోర్డును గంటల తరబడి వాడటం వల్ల వేళ్ల కండరాలు పట్టేయడం, వేళ్లకు రక్తప్రసరణ తగ్గి తిమ్మిరెక్కటం, వంటి సమస్యలు రావచ్చు. కనుక పరిమిత సమయమే కీబోర్డు వాడండి.



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE