వేసవిలో శరీరానికి వేడి తగలకుండా ఏసీ, కూలర్లు వాడతాం. గొంతెండిపోతే ఎప్పటికప్పుడు నీరు గానీ, శీతలపానీయాలు తాగి సేదతీరుతాం. కానీ, కళ్ల గురించి అసలు పట్టించుకోం. నిజానికి మండే ఎండల ప్రభావం ముందుగా కళ్ళ మీదే పడుతుంది. నానాటికీ పెరుగుతున్న కాలుష్యం, ఆధునిక జీవనశైలి కారణంగా వచ్చిన మార్పులు, షిఫ్టుల్లో పనిచేయటం వంటి ఎన్నో కారణాల వల్ల కళ్ళు తీవ్రంగా అలసిపోయి కళ్ళు పొడిబారటం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ వేసవిలో ఈ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం పొంచి ఉన్నందున అందరూ వేసవిలో నేత్ర సంరక్షణ మీద ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందే.

జాగ్రత్తలు

  • విటమిన్ ఏ సమృద్ధి గా ఉండే ఆకుకూరలు, పండ్లు, చేపలు, క్యారెట్, గుడ్డు ఎక్కువగా తీసుకోవాలి.
  • వేసవిలో పిల్లలు బావులు, చెరువుల్లో ఈత కొడుతుంటారు. దీంతో ఆ నీటిలో నీటిశుద్ధి కొరకు కలిపిన రసాయనాల ప్రభావం కళ్ళమీద పడి కళ్ల దురద, ఎరుపెక్కటం వంటి లక్షణాలు కనిపిస్తాయి గనుక మంచినీటిలోనే ఈత కొట్టాలి.
  • వేసవి మధ్యాహ్న సమయంలో వాహన ప్రయాణం చేసేవారు కళ్ళద్దాలతో బాటు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.
  • కంటి అందం పేరుతో మహిళలు వాడే సౌందర్య పోషణా ఉత్పత్తులను వేసవిలో తగ్గించటం మంచిది.
  • వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రత , ఎండధాటినుంచి కళ్ళను రక్షించుకునేలా చలువ కళ్లద్దాలు వాడాలి. రోడ్లపై లభించే నాణ్యతలేని కళ్ల అద్దాలను ఉపయోగించకపోవడం మంచిది.
  • ఎండలో నుంచి రాగానే చల్లని నీటితో కళ్ళు, ముఖం శుభ్రంగా కడుక్కోవటమే గాక రోజుకు 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి.
  • తగినంత పోషకాహారం, సరిపడా నీరు తాగితే వేసవిలో నేత్ర సమస్యలు రావు.
  • వేసవిలో కాంతిలో దుమ్ము, తేమ పడితే కళ్ళు ఎరుపెక్కటం, కంటి కురుపులు రావచ్చు గనుక కంటిలో దుమ్ము పడకుండా చూసుకోవాలి.
  • వేసవిలో వడగాలి వల్ల కంట్లో తేమ వేగంగా తగ్గుతుంది గనుక తరచూ కళ్ళను నీళ్ళతో కడుక్కోవాలి.
  • కంటి భాగంలో ఏదైనా చర్మ సమస్య ఉంటే వైద్యుని సలహాపై మందులు వాడాలి తప్ప గోకటం, కాను రెప్పలు నలపడం చేయరాదు. కంటిలో సొంతంగా కంటిచుక్కలు వేసుకోవడము, ఆయింట్మెంటు పెట్టుకోవడం చేయరాదు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE