ఈ రోజుల్లో ఉద్యోగులు రోజుకు 8 గంటలపాటు కదలకుండా కూర్చొని పనిచేయాల్సి వస్తోంది. ఇలా అంతసేపు కదలకుండా ఒకే భంగిమలో కూర్చోవటం మూలంగా శరీర బరువంతా వెన్ను చివరి భాగం మీద పడి తీవ్రమైన వెన్నునొప్పికి కారణమవుతోంది. ఈ ఇబ్బందికర పరిస్థితినే వైద్యభాషలో 'కాక్సీడినియా' అంటారు. వెన్ను దిగువ కొసన ఉండే త్రిభుజాకారపు ఎముక వద్ద మొదలయ్యే ఈ నొప్పి క్రమంగా తొడల వరకూ పాకుతుంది. ఈ సమస్య ఉన్నవారి తుంటి వద్ద కొద్దిగా నొక్కినా బాగా నొప్పి కలుగుతుంది. కొందరిలో మూత్రవిసర్జన సమయం లో లేదా ఆ తర్వాత లేచి నిలబడేటప్పుడు కూడా వెన్ను నొప్పి కనిపిస్తుంది.

 కారణాలు

 • మితిమీరిన శరీర బరువు
 • ఎక్కువ దూరము బైక్ నడపటం,
 • కొన్ని రకాల మందుల వినియోగం
 • ఎక్కువకాలము మలబద్దకం బారినపడటం
 • కాక్సిక్స్ ఎముక గాయపడి దాని చుట్టూ ఉండే నరాల పనితీరు దెబ్బతినటం

నివారణ

 • ఎప్పుడూ ఒకే భంగిమలో కూర్చోకుండా లేచి తిరగటం, వెనక్కి వాలి కూర్చోవటం చేయాలి.
 • సుఖవిరోచనం కావటానికి పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
 • కూర్చునే కుర్చీ మెత్తగా ఉండేలా చూసుకోవటం, వెన్ను దిగువన మెత్తని దిండు ఆనుడుగా పెట్టుకోవాలి.
 • నెమ్మదిగా డ్రైవింగ్ చేయటం, గతుకుల రోడ్లకు బదులు దూరమైనా మంచి రోడ్ ను ఎంచుకోవాలి.
 • నొప్పి అనిపించినప్పుడు వేడి నీళ్ళ కాపడం పెట్టటం వల్ల నొప్పి ఉపశమిస్తుంది.
 • సమస్య అనిపించినా తొలినాళ్లలోనే వైద్యుని సంప్రదించి తగిన సలహా కోరాలి.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE