కంటి సమస్యల్లో శుక్లాల తర్వాత ఎక్కువగా కనిపించే సమస్య గ్లకోమా. దీనినే వాడుక భాషలో నీటికాసులుగా పిలుస్తారు. కనుపాప భాగంలో స్రావాల ప్రసరణకు  అవరోధం ఏర్పడినప్పుడు అది కంటి నరాల మీద ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల క్రమంగా కంటి చూపు తగ్గుతూ చివరకు పూర్తిగా చూపు కోల్పోవాల్సి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కంటిచూపు కోల్పోవటానికి కారణమవుతున్న రెండవ ప్రధాన సమస్యగా గ్లకోమా ఉంది. సకాలంలో చికిత్స తీసుకునే వారిలోనూ సుమారు ఆరు శాతం మందిలో కంటి చూపు దెబ్బతింటోంది.   అందుకే ఈ సమస్యను సకాలంలో గుర్తించి తగిన చికిత్స తీసుకోవటం అవసరం.

ఇది పిల్లల నుంచి పెద్దల వరకు  ఏ వయసు వారికైనా రావచ్చు. కొందరు పిల్లల్లో ఇది పుట్టుకతోనే ఉంటుంది. ఇతర అనారోగ్యాల మాదిరిగా గ్లకోమా విషయంలో ముందస్తు లక్షణాలేమీ కనిపించవు. దీని బారిన పడిన వారికి కంటి చివరి భాగపు వస్తువులు, దృశ్యాలు కనిపించవు. అయితే వారు తల తిప్పి చూడటానికి అలవాటు పడటం వల్ల చాలా కాలం వరకు ఈ సమస్యను గుర్తించలేరు. గ్లుకోమా బారిన పడిన వారికి చికిత్స చేసినంత మాత్రాన పూర్వంలా కంటి చూపు పొందటం సాధ్యం కాదు. అయితే కంటిచూపు మరింత మండగించాకుండా మాత్రం కాపాడుకోవచ్చు. ఒకసారి ఈ సమస్య బారిన పడిన వారు జీవితాంతం పరీక్షలు చేయించుకుంటూ కంటి చూపు తగ్గకుండా జాగ్రత్త పడాల్సిందే. 

గ్లకోమాలో రకాలు...

 ప్రైమరీ గ్లకోమా: కారణం ఏదీ లేకుండా ఈ వ్యాధి కనిపిస్తే దాన్ని ప్రైమరీ గ్లకోమా అంటారు. ఈ తరహా కేసుల్లో నొప్పి, కన్ను ఎరబ్రారడంతో పాటు చూపును కాస్త వేగంగా కోల్పోతారు. 

 సెకండరీ గ్లకోమా: ఈ తరహా గ్లకోమా కంటికి దెబ్బతగలడం,  కంటిలోని  కటకం దెబ్బతినడం, ఇన్ఫెక్షన్స్ వంటి కారణాల వల్ల వస్తుంది.

 1. కంజెనిటల్ గ్లకోమా / పీడియాట్రిక్ గ్లకోమా: ఇది చిన్నపిల్లల్లో వచ్చే గ్లకోమా. కొంతమందిలో పుట్టుకతోనే కంటిలో ఉండే యాక్వస్ ద్రవం బయటకు ప్రవహించదు. దాంతో కనుగుడ్డు మామూలు కంటే పెద్దదిగా ఉంటుంది. దీన్నే బూఫ్తాల్మస్ అంటారు. ఈ జబ్బు ఉన్న పిల్లల్లో కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. పిల్లలు కాంతిని చూడలేరు. ఈ పరిస్థితిని ఫొటోఫోబియా అంటారు.

ఎవరికి  రావచ్చు?

 • మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడే వారు,
 • ధూమపానం చేసేవారు
 • కంటికి బలమైన గాయం తగలడం
 • కార్నియా మధ్యభాగం 5 మి.మీ. కంటే తక్కువ దళసరి కలిగి ఉండటం
 • 40 ఏళ్ళుదాటిన వారు
 • కుటుంబ సభ్యులలో ఎవరికైనా గ్లకోమా వ్యాధి ఉన్నట్లయితే
 • దృష్టి క్షేత్రంలో లోపాలున్నవారికి

చికిత్స

 1. వైద్యచికిత్స: జీవితాంతం చుక్కల మందులు వాడాలి.
 2. లేజర్ చికిత్స: కొన్ని రకాల గ్లకోమాలకు మాత్రమే ఈ చికిత్స ఉపయోగపడుతుంది
 3. శస్తచ్రికిత్స: పై పద్ధతుల వల్ల కంటిలోని ఒత్తిడి(ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్) నియంత్రణలోకి రాకపోతే శస్తచ్రికిత్స అవసరమవుతుంది.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE