స్త్రీ  జీవితం పరిపూర్ణం అయ్యేది మాతృత్వంతోనే . అయితే ఆ భాగ్యానికి నోచుకోని మహిళలు ఎందరో. సంతానలేమికి భార్య, భర్త లలో ఏ ఒక్కరి లోపాలతో బాటు ఇద్దరిలోని లోపాలూ కారణం కావచ్చు. సంతానలేమికి ఇప్పుడు చక్కని ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపధ్యంలో  సంతానలేమిపై మన సమాజంలో ఉన్న కొన్ని అపోహలు, కారణాలు, వాటి వెనకున్న అసలు వాస్తవాల గురించి తెలుసుకుందాం.

 

సాధారణంగా ఏడాది పాటు ఎలాంటి గర్భనిరోధకాలు వాడకుండా గర్భధారణకు ప్రయత్నించినా, ఆ దంపతులకు సంతానం కలగక పోతే దానిని సంతానలేమి అని చెప్పొచ్చు.పురుషులలో వీర్య కణాల సంఖ్య తగ్గటం,వీర్యం నాణ్యత పడిపోవటం, శుక్ర కణాలు చలించే తీరులో లోపాల వంటి పలు అంశాలు సంతాన లేమికి కారణం అవుతాయి. మహిళల్లో అండాశయ సామర్ధ్యం తగ్గటం, అండకోశాల పనితీరు లోపాలు, ఋతుచక్ర సమస్యలు తదితరాలు ప్రధాన సమస్యలుగా ఉంటాయి. వీటితో పాటు జన్యుకారణాలు, మధుమేహం,  సెక్స్‌ హార్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంథుల పనితీరు తగ్గిపోవటం,  రక్తంలో ప్రోలాక్టిన్‌ పరిమాణం అధికంగా ఉండడం, వాతావరణ కాలుష్యం, ధూమపానం వంటి కారన్నలు కూడా సమస్యకు కారణం కావచ్చు. స్త్రీ, పురుషులలో ఏ ఒకరిలో లోపం వల్ల లేదా ఇద్దరిలో ఉన్న లోపాల కారణంగా సంతానం కలగకపోవచ్చు. ప్రతీ ఆరు జంటల్లో ఒక జంట ఏదో ఒకస్థాయిలో సంతానలేమి సమస్య బారిన పడుతుంది. ఇలాంటివారు తప్పక  వైద్యసలహా తీసుకోవాలి. 

ఈ సమస్య ఉన్న దంపతులకు ముందుగా థైరాయిడ్, వీర్య పరీక్షలతో బాటు అల్ట్రా సౌండ్  వంటి పరీక్షలు చేయటంతో బాటు వారి గత ఆరోగ్య చరిత్రనూ పరిశీలిస్తారు. వీటితోబాటు దంపతుల వయసు, వారి అలవాట్లు, జీవనశైలి, స్థూలకాయం, బరువు తదితర అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటారు. చికిత్స పొందే వారిలో చాలామంది ఔషధాల వినియోగం, ఐయూఐ,  ఐవీఎఫ్‌ వంటి ఆధునిక విధానాల ద్వారా సంతానాన్ని పొందగలుగుతున్నారు. వీటిలో  ఐయూఐలో 15 -20 శా తం దాకా, ఐవీఎఫ్‌లో 40-50 శాతం దాకా విజయావకాశాలు ఉంటాయి. అందుకే సంతానం లేని జంటలు ఎక్కువ ఆలస్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకుంటే తప్పక పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE