• HOME
  • భక్తి
  • గ్రహణం సమయంలో ఆలయాలను ఎందుకు మూసివేస్తారో తెలుసా?

సూర్యచంద్రులతో భూమికి గల సంబంధాన్ని బట్టే కాలగణన జరుగుతుంది. అంతటి ప్రాశస్త్యం గల సూర్య చంద్రులకు గ్రహణం అనేది పడితే అది దుర్దినమే అవుతుంది. అలాగే మనకు కాంతి, చల్లదనాన్ని ప్రసాదించే సూర్య చంద్రులను క్రూరగ్రహాలైన రాహుకేతువులు మింగడమంటే.. అది లోకానికంతటికీ కష్టకాలమవుతుందని.. అందుకే గ్రహణం పట్టినంతసేపూ ఆలయాలను మూసివేసి, గ్రహణం విడిచిన తర్వాత శుద్ధిచేసి ఆలయాల్లో పూజలు చేస్తారు. భక్తులకు ప్రవేశం కల్పిస్తారు. 
 
అంతేగాకుండా గ్రహణం అంటే రాహు, కేతువులు, సూర్య, చంద్రులను మింగివేయడం. ఆ సమయంలో పూజలు చేస్తే మంత్రశక్తి క్షీణిస్తుందని దేవాలయాలను మూసివేస్తారు. అయితే శ్రీ కాళహస్తి క్షేత్రానికి మాత్రం ఈ అంశం వర్తించదు. ఎందుకంటే ఈ క్షేత్రంలో రాహు, కేతువులను పూజిస్తారు కాబట్టి. 
 
సంపూర్ణ సూర్యగ్రహణానంతరం గ్రహణాతీతుడైన శ్రీ కాళహస్తీశ్వరుడిని దర్శించుకోవడం శుభఫలితాలను ఇస్తుంది. చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తిలో వెలసిన ముక్కంటి దేవాలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతంలో పరమేశ్వరుడు స్వయంభులింగంగా వెలసి భక్తులకు దర్శనమిస్తున్నాడు.
 
వాయులింగేశ్వరుడు, సర్వదోషహరుడు, శ్రీ కాళహస్తీశ్వరుడిగా పిలువబడే ఈ శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాళహస్తీశ్వరుని గ్రహణానంతరం దర్శనం చేసుకునే వారికి దారిద్ర్యం, దోషాలు తొలిగిపోయి.. సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం
 
అందుకే దేశంలోని ఆలయాలన్నీ గ్రహణం రోజున మూతపడినా శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే ఉంటుంది. అంతేగాకుండా ముక్కంటికి గ్రహణకాలంలోనే గ్రహణ కాలాభిషేకాలు నిర్వహిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ కాళహస్తిలో ఒక్క శనీశ్వరుని తప్ప నవగ్రహాలను ప్రతిష్టించకూడదు.
 
అందుకు బదులుగా ఈ క్షేత్రంలో రాహుకేతు గ్రహాలు నెలకొని ఉన్నాయి. రాహుకేతు దోషాలను నివారించే దివ్యశైవక్షేత్రం కాళహస్తి కాబట్టి, సూర్య, చంద్రగ్రహణ దోషాలు ముక్కంటిని ఏమాత్రం అంటవని పండితులు చెప్తున్నారు. దీంతో శ్రీకాళహస్తీశ్వరుడు గ్రహణాతీతుడుగా పిలువబడుతున్నాడని వారంటున్నారు. 
 
ఇంకా ఆలయ పరిసరాల్లో 36 తీర్థాలున్నాయని, సూర్యగ్రహణానంతరం ఈ తీర్థాల్లో స్నానమాచరించి, వాయులింగేశ్వరుడిని దర్శించుకునే వారికి పుణ్యఫలితాలు, అష్టైశ్వర్యాలు, సకల భోగభాగ్యాలు చేకూరుతాయని నమ్మకం.



Recent Stories







bpositivetelugu

పరిమళాల వాడకంలో మెళకువలు

మనసుకు, శరీరానికి హాయినిచ్చే పరిమళాలను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా మహిళలు, యువత ఈ విషయంలో ముందుంటారు.

MORE
bpositivetelugu

రంజాన్ దాన, ఉపవాసాల విశేషాలు

ఏ పండుగైనా శాంతిని, మానవాళి హితాన్నే ప్రబోధిస్తుంది. రంజాన్ (రమదాన్) పండుగా ఇదేవిషయాన్ని చెబుతోంది. ఇస్లామీయ కేలండర్లో

MORE