రామయ్య అనుగ్రహానికి రామకోటి రాయటం ఉత్తమ మార్గమని మనకు తెలుసు. ఈ సంప్రదాయం దేశవ్యాప్తంగా ఉంది. అయితే ఈ సత్కార్యానికి పూనుకున్న వ్యక్తి కొన్ని నియమాలను పాటించాలి.అవేమిటో తెలుసుకుందాం. 

* రామకోటి రాయాలని నిర్ణయించుకున్న వ్యక్తి దైవ సన్నిధిలో మానసికంగా సంకల్పం చేసుకోవాలి.

* మంచి రోజు చూసుకుని రామకోటి పుస్తకానికి పసుపు, కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో పూజించాలి. శ్రీ రామ అష్టోత్తరశతనామావళి చదివి పుస్తకం కళ్ళకద్దుకుని రాయడంప్రారంభించాలి.

* రామకోటి రాసేటప్పుడు అనవసర చర్చలు, ఇతర వ్యాపకాలు, ఆలోచనలు పెట్టుకోకుండా స్థిమితంగా శ్రీరామ నామాన్నిఉచ్చరిస్తూ రాయాలి. ఏకాంత ప్రదేశమైతే మరీ మంచిది.

* అనుకోని కారణాల వల్ల రాయటం ఆపాల్సి వస్తే సరి సంఖ్య వరకు రాసి పుస్తకంమూసి నమస్కరించి వెళ్ళండి. పని పూర్తికాగానే కాళ్ళు , చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయాలి.

* రామకోటి పుస్తకం, రాసేందుకు వాడే కలం విడిగా పెట్టుకోవటం మంచిది.

* రామకోటిని రోజులో ఏ సమయంలోనైనా రాయొచ్చు. అయితే శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత గురించి మరువొద్దు. పూర్తి చేయటమే లక్ష్యంగా రామకోటి రాసి ఉపయోగం లేదు. శ్రద్ధ, భక్తి తో 10 సార్లు రాసినా చాలు. అలసట, నిద్ర మత్తు ఉన్నప్పుడు తగినంత విశ్రాంతి తీసుకొని మళ్ళీ మొదలు పెట్టాలి.

* లక్ష నామాలు రాయటం పూర్తయిన ప్రతిసారీ శక్తి కొలది పూజ, నివేదన చేసి ఆ ప్రసాదాన్ని నలుగురికీ పంచాలి.అలాగే కోటి నామాలు రాసిన తర్వాతా చేయాలి.

* పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామయ్యకు లేదా ఏదైనా రామాలయంలో అప్పగించాలి. అదీ వీలుకాకుంటే ప్రవహించే నదిలో వదలాలి.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE