పూజ లేదా ఆరాధన విషయంలో మన పూర్వీకులు కొన్ని నిర్దిష్టమైన నియమాలను ఏర్పరచారు.ప్రాంతాలను బట్టి వీటిలో స్వల్ప మార్పులు కనిపించినా స్థూలంగా ఇవే నియమాలు కనిపిస్తాయి. రోజులో పూజ కోసం కేటాయించేది కాస్త సమయమే అయినా దానిని శాస్త్రీయంగా చేయటం వల్ల చక్కని ఫలితాలు పొందవచ్చు. పరమాత్మను సేవించే విషయంలో పాటించవలసిన కొన్ని ప్రధాన నియమాలను గురించి తెలుసుకుందాం. 

 • చాప లేదా వస్త్రము మీద కూర్చొని మాత్రమే పూజ చేయాలి తప్ప నేలపై కూర్చొని మాత్రం పూజ చేయరాదు.
 • ఇంట్లో పూజించే విగ్రహాలు మట్టి లేదా లోహ (బంగారు, వెండి, రాగి) విగ్రహాలు మంచిది. అదీ..  అంగుష్ఠం ప్రమాణము(వేలు పొడవు) లేదా అంతకంటే తక్కువ సైజులో ఉండటం ఉత్తమం.
 • పూజగదిలో భారీ రాతి, లోహ విగ్రహాలు పెట్టుకుంటే ఆలయంలో మాదిరిగా నిత్యం నిష్ఠగా పూజ చేసి , నివేదన చేయటం తప్పనిసరి. లేనిపక్షంలో ఆ విగ్రహాలు కొంతకాలానికి రుణశక్తి నిలయాలుగా మారి చెడు ప్రభావాలను కలిగిస్తాయి. రుద్రాక్షలు, సాలిగ్రామాలు పూజలో ఉంచేవారు కూడా ఈ నియమాన్ని గుర్తుంచుకోవాలి. ప్లాస్టిక్, సిమెంట్, గాజు, కాగితపు ప్రతిమలు, విరిగిన విగ్రహాలు లే దా చిరిగిపోయిన పటాలు పూజకు పనికిరావు.
 • సాధకుడు, విగ్రహం ఎదురుగా కూర్చొని పూజ చేయాలి. పూజా పీఠంపై పూజించే విగ్రహాలను ఒకదానికి మరొకటి ఎదురుగా పెట్టకూడదు.
 • అశౌచ్యం ఉన్నప్పుడు మినహా ఇంట్లో రోజూ దీపారాధన చేయాలి. దేవుని ప్రతిమకు ఎదురుగా దీపాలు ఉంచాలి.
 • పూజగదిలో ఆలయంలో మాదిరి గంటను ఏర్పాటు చేయకూడదు. ఇంట్లో హారతి ఇచ్చేటప్పుడూ ఘంటానాదం చేయరాదు.
 • పూజ గదిలో దేవుని ప్రతిమల సరసన మరణించిన పూర్వీకుల పటాలు పెట్టరాదు.
 • నైవేద్యం పెట్టేటప్పుడు విగ్రహం ఎదురుగా పెట్టాలి తప్ప సాధకుడికి ఎదురుగా కాదు.
 • తూర్పు వైపు తిరిగి పూజ చేయటం సంప్రదాయం. అయితే తప్పనిసరి మాత్రం కాదు. పూజ విషయంలో శ్రద్ద, భక్తి మాత్రమే ప్రధానం .
 • జీవాత్మ, పరమాత్మలకు సంకేతంగా 2 ఒత్తులు వేసి దీపారాధన చేస్తారు. దీపారాధనకు కుసుమనూనె గాని, నువ్వులనూనె గాని వాడడం మంచిది. ఎట్టిపరిస్థితిలోనూ ఒక ఒత్తి వేసి దీపారాధన చేయరాదు.
 • ధూపం లేదా అగరుబత్తులను వెలిగించటం వల్ల ఆ ప్రాంతమంతా శుద్ధి అవుతుంది. సానుకూల తరంగాల వ్యాప్తికి ఇది దోహదపడుతుంది .
 • అగరుబత్తీలను దీపారాధనతో గాక తప్పకుండా అగ్గిపుల్లతో విడిగా వెలిగించాలి.
 • పూజ విషయంలో ఆడంబరత పనికిరాదు. భక్తితో సమ్పర్పించేది ఒక్క పూవు లేదా ఆకు అయినా పరమాత్మ సంతోషంగా స్వీకరిస్తాడు.
 • బీజాక్షరాలు, శ్లోకాలు మనసులోనే మననం చేసుకుంటేనే చక్కని ఫలితాలుంటాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE