పుష్కరం అంటే 12 సంవత్సరాలు అని ఆర్ధం. భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులకు బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించిన సమయంలో పుష్కరాలు వస్తాయి. ఇలా ఒక్కో నదికి 12 ఏళ్లకోమారు పుష్కర వేడుక జరుగుతుంది. మనదేశంలో ఎన్నో నదులున్నప్పటికీ కేవలం 12 నదులకు మాత్రమే ఈ పుష్కర వేడుకలు జరుగుతాయి.  ఈ సంవత్సరం ఆగస్టు 12 న బృహస్పతి కన్యారాశిలో ప్రవేశిస్తున్నవేళ ఆరంభమయ్యే కృష్ణమ్మ పుష్కర వేడుక ఆగష్టు 23 వరకు.. అంటే 12 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనుంది. 

పుష్కర అనే శబ్దానికి నీరు, వరుణుని కుమారుడు వంటి పలు అర్థాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో పుష్కరాల సందర్భంగా ఇచ్చే నదీ హారతులు, చేసే పుణ్య స్నానాలను చూసినప్పుడు ఇదంతా ధార్మిక వ్యవహారంగా కనిపించినప్పటికీ నిజానికి నదీ సంరక్షణ, జల ప్రాధాన్యాన్ని మానవాళికి తెలియజేయటం, పవిత్ర భావాన్ని పెంపొందించటం ద్వారా నది పరిశుభ్రతను కాపాడటం వంటి ఉదాత్తమైన భావనలు స్పష్టంగా అర్థం అవుతాయి.

గంగానదికి మేషరాశిలోను, నర్మదానదికి వృషభరాశి, సరస్వతీ నదికి మిధునరాశి, యమునకు కర్కాటరాశి, గోదావరికి సింహరాశి, కృష్ణానదికి కన్యారాశి, కావేరికి తుల రాశి, భీమానదికి వృశ్చికరాశి, పుష్కరవాహిని/రాధ్యసాగనదికి ధనుర్రాశి, తుంగభద్ర నదికి మకరరాశి, సింధునదికి కుంభరాశి, ప్రాణహిత నదికి మీనరాశిలోను బృహస్పతి ప్రవేశకాలం నుండి పుష్కరాలను నిర్వహించుకోవడం ఆనాదిగా వస్తోంది.

మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో పుట్టే కృష్ణమ్మ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. పుష్కరాల సందర్భంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలు, నది వెంటనున్న పుణ్యక్షేత్రాలు  ఆధ్యాత్మిక శోభతో నిండిపోనున్నాయి. భక్తుల సౌకర్యార్ధం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశాయి. మనం కూడా ఆ అరుదైన సందర్భంలో కృష్ణలో పుణ్య స్నానం చేసి తరిద్దాం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE