పుష్కర సమయంలో పుష్కర సహితుడైన బృహస్పతి, ముక్కోటి దేవతలు, పితృదేవతలు కృష్ణానదిలోనే ఉంటారు కావున ఈ సమయంలో పుణ్యస్నానం కోటిజన్మ పుణ్యఫలం అని ప్రతీతి. అయితే పుష్కరస్నానానికి గాని, తీర్థస్నానానికి గాని వెళ్ళినపుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. అవి..

  • తీర్థ స్థలానికి చేరిన రోజు ఉపవాసం చేయాలి.
  • దంపతులు కలిసే స్నానం చేయాలి. బ్రహ్మముడి వేసుకుని ఈ స్నానం చేయాలి.
  • పురుషులు శిఖమాత్రమే ఉంచుకుని శిరోమండనం చేయించుకోవాలి. స్త్రీలు శిరోమండనం చేయించుకోరాదు.
  • తండ్రి లేనివారు తీర్థస్నానం చేయాలి.
  • పుష్కర దినాలలో తొమ్మిదవ రోజుగానీ, లేదా తమ పెద్దలు మరణించిన తిథి రోజు గానీ పితృ శ్రాద్ధాన్ని నిర్వహించాలి.
  • సమీప బంధువులకు, పిండ ప్రదానం చేయవచ్చు. తర్పణం విడవవచ్చు. స్నేహితులకూ ఆత్మియులకూ పిండ ప్రదానం చేస్తే సరిపోతుంది.
  • పిండ ప్రదానం ఆకు దొప్పలలోనే చేయాలి.
  • తీర్థాల సమీపంలో మలమూత్ర విసర్జన, ఉమ్మి వేయడం, బట్టలు ఉతకడం చేయరాదు.
  • స్నానం చేసే సమయంలో నిట్టనిలువుగా మూడు సార్లు మునకలు వేయాలి.



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

  దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత 

MORE