జపమాలలో 108 పూస‌లే ఎందుకుంటాయి? ఇది కేవలం లెక్కకోసం చేసిన ఏర్పాటేనా? లేక దీని వెనక మరేదైనా ఆంతర్యం ఉందా? అసలు 108 సంఖ్య గురించి మన శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి? వంటి సందేహాలకు పెద్దలిస్తున్న వివరణ తెలుసుకుందాం.

 • మనిషి సగటున రోజుకు 21,600 సార్లు శ్వాసిస్తాడు. అందులో 10,800 సూర్యాంశ, 10,800 చంద్రాంశ అని తంత్ర శాస్త్రం చెబుతుంది. మనిషికి ప్రాణంకన్న ప్రియమైనది లేదు. అలాంటి ప్రియమైన ప్రాణానికి ఏకైక ఆధారం శ్వాస. మనకు శ్వాస ద్వారా ప్రాణశక్తిని ప్రసాదించిన ఆ పరమాత్మను ప్రతి శ్వాసకీ స్మరిస్తూ కృతజ్ఞత చెప్పటమే జపం. అందుకే మన పూర్వీకులు రోజుకు 10800 నామ జపం చేసేవారట. కాలంతో బాటు వచ్చిన మార్పులను బట్టి ఈ సంఖ్య 108 కి తగ్గినదని చెబుతారు.
 • జ్యోతిషం ప్రకారం మనిషి జీవితం రాశుల, గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో రాసుల సంఖ్య 12 కాగా గ్రహాల సంఖ్య 9. ఈ రెంటినీ గుణిస్తే 108 సంఖ్య వస్తుంది. అందుకే జ‌ప‌మాల‌లో 108 పూస‌ల‌ను నిర్థారించారు. అంటే 108 సంఖ్యా మొత్తం విశ్వానికి ప్రాతినిధ్యం వ‌హిస్తుందన్నమాట.
 • జ్యోతిష శాస్త్రం ప్రకారం నక్షత్రాలు 27. ఒక్కో న‌క్షత్రానికి 4 పాదాలు. అంటే 27 న‌క్షత్రాల‌కు క‌లిపి మొత్తం 108 పాదాల‌వుతాయి. జ‌ప‌మాల‌లోని ఒక్కో పూస ఒక్కో పాదానికి ప్రాతినిధ్యం వ‌హిస్తుంది. అవే 108 ప్రాథమిక మానవ ప్రవృత్తులు.
 • బౌద్ధులు వాడే జపమాలలోనూ 108 పూసలు ఉంటాయి. టిబెట్టు బౌద్ధుల 'కహగ్పూర్'లో 108 పంక్తులు ఉంటాయి. పెకింగ్ లో ప్రకాశ వంతంగా కనిపిచే చైనీస్ వైట్ హౌజ్ లో 108 స్తంభాలు ఉన్నాయి.
 • జపాన్లో చనిపోయిన వారి కర్మకాండలు జరిపించేప్పుడు 108 దీపాలను వెలిగిచి,108 రూపాయలు దానంచేస్తారు. నూతన సంవత్సర సమయంలో ౧౦౮ సార్లు గంటలు కొడతారు. బర్మాలోని బుద్ధుని పాద చిహ్నంలో 108 భాగాలున్నాయి.
 • 108ని కూడితే వచ్చేది 9. ఇది పరిపూర్ణత్వాన్ని సూచిస్తుంది. అంతేకాదు ఏ సంఖ్యనైనా 9 సార్లు హెచ్చించి, కూడినా వచ్చేది తొమ్మిదే. మన ఉపనిషత్తుల సంఖ్య కూడా 108.
 • ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి వ్యాసాన్ని 108 తో గుణిస్తే సూర్యుడికీ, భూమికీ మధ్య దూరం వస్తుంది. అట్లాగే చంద్రుడి వ్యాసాన్ని 108 తో గుణిస్తే చంద్రుడికీ, భూమికీ మధ్య దూరం వస్తుంది. సూర్యుడి వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు.
 • ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలోని మర్మ స్థానాల సంఖ్యా 108. ఈ మర్మస్థానాల ద్వారా ప్రాణశక్తి జీవిని చైతన్యపరుస్తుంది.
 • శ్రీ చక్రయంత్రంలో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలు ఉంటాయి. వీటి మొత్తం 108.
 • భరతముని రూపొందించిన నాట్యశాస్త్రంలో చేతులు, కాళ్లు కలిపి చేసే నాట్యభంగిమల మొత్తం సంఖ్య 108.
 • సంస్కృత భాషలో అక్షరాలా సంఖ్య 54 కాగా వీటికి శివ, శక్తి తత్వాలైన స్త్రీ, పురుష రూపాలుంటాయి. అనగా 54 X 2 = 108.
 • భారతీయ కాలగణన ప్రకారం బ్రహ్మకు ఒక రోజు అంటే 4 యుగాలు కలిసి 43,20,000 సంవత్సరాలు. ఇది 108 అనే సంఖ్యతో భాగించబడుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE