శరన్నవరాత్రులలో తొలిరోజు అమ్మ శైలపుత్రిగా దర్శనమిస్తోంది. పర్వత రాజు హిమవంతుని కుమార్తె అయిన అమ్మవారు వృషభ వాహనం మీద ఆసీనురాలై కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమచేతిలో కమలముతో, తలపై చంద్రవంకను ధరించిప్రశాంత వదనంతో భక్తులకు దర్శనమిస్తుంది.

అవతార విశేషము

నవదుర్గలలో మొదటి రూపమైన ఈ శైలపుత్రి పూర్వజన్మలో దక్ష ప్రజాపతి పుత్రిక దాక్షాయని. సతీదేవి పేరిట పరమేశ్వరుని వివాహమాడింది. ఆ సమయంలో దక్షుడు ఒక యాగాన్ని నిర్వహించ తలపెట్టి కూతురు, అల్లుళ్లను తప్ప అందరినీ ఆహ్వానిస్తాడు. తండ్రి చేస్తున్న మహాయాగాన్ని గురించి విన్న అమ్మవారు అక్కడికి వెళ్లాలని భావించి పతి అనుమతి కోరగా,పిలుపు లేని కారణంగా తాము అక్కడికి వెళ్ళటం సరికాదని ఈశ్వరుడు నచ్చజెబుతాడు. యాగానికి వెళితే తల్లిదండ్రులతో బాటు తోబుట్టువులనూ చూడొచ్చని చెబుతూ పదే పదే కోరటంతో ఆమె కోరిక కాదనలేక వెళ్లందుకు పరమేశ్వరుడుఅనుమతిస్తాడు.

సంతోషంగా పుట్టింటికి వెళ్లినసతీదేవికి అడుగడుగునా పరాభవమే ఎదురవుతుంది. తనతో బాటు పతిఅయిన శంకరుని పట్ల తండ్రి, తోబుట్టువులంతా అవహేళనగా మాట్లాడగా అందుకుఆమె మనస్సు కలత చెందుతుంది. యాగసభలో పతిని తూలనాడుతూ తండ్రి మాట్లాడినమాటలతో మరింత అవమానానికి గురైన అమ్మవారు అక్కడే బొటనవ్రేలితో యోగాగ్నిని సృష్టించి అందులో భస్మమవుతుంది . సంగతితెలుసుకున్న ఈశ్వరుడు క్రోధుడైతన ప్రమథగణాలను పంపి దక్షుని యజ్ఞాన్ని నాశనం చేయిస్తాడు. అలా ఆనాడు స్వామికి దూరమైన అమ్మవారు మరుజన్మలోహిమవంతుని పుత్రిక ‘శైలపుత్రి’గాజన్మించింది. ఈ శైలపుత్రిని పార్వతి, హైమ అనీ పిలుస్తారు. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి ‘అర్ధాంగి’ అవుతుంది.

ఈ తల్లి అనుగ్రహానికి ఎల్లలు లేవు. ఈ రోజునేఉపాసకులు , యోగులుతమ మనస్సులను మూలాధారచక్రంలో స్థిరపరుచుకొని యోగసాధన ఆరంభిస్తారు. ఈ రోజు అమ్మవారికి నీలం రంగు వస్త్రాన్ని సమర్పించి కట్టె పొంగలినినైవేద్యంగా నివేదిస్తారు. సంతానం కోరేవారు, గ్రహపీడలతో బాధపడేవారు, వివాహ సంబంధిత సమస్యలున్నవారు ఈ రోజు అమ్మను ఆరాధిస్తే శుభ ఫలితాలు పొందుతారు.

శ్లోకం

వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ ।

వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

ధర్మమే సుగుణాభిరాముని మార్గం

తన సుగుణాలతో, సుపరిపాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్న చక్రవర్తి శ్రీరాముడు. ఆ జగదభిరాముని జన్మదినమే శ్రీరామనవమి.

MORE