• HOME
  • భక్తి
  • బ్రహ్మతత్వానికి ప్రతీక బ్రహ్మచారిణి

నవదుర్గల్లో రెండో రూపం ‘బ్రహ్మచారిణి’. ఈ తల్లి బ్రహ్మతత్వ స్వరూపిణి. బ్రహ్మచారిణీ అనగానే వివాహం కాని స్త్రీ అనుకుంటాము గానీ నిజానికి ఈ తల్లిబ్రహ్మతత్వము గురించి తెలిపే స్వరూపం.సకల వేదాలకు, తత్వాలకు ఈ తల్లి ప్రతీక . సాధకులనుమోక్షసిద్ధినిఅందించే ఈ తల్లికిఒక్కసారి నిండు మనసుతో నమస్కరిస్తేజన్మ సార్ధకమైనట్లే. తెల్లని వస్త్రాల్లో కనిపించే అమ్మవారు కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్నీ ధరించి ఉంటుంది.

అవతార విశేషాలు

హిమవంతుని కూతురైన పార్వతి ఈశ్వరుని పతిగా పొందేందుకు బ్రహ్మచారిణీ దేవిగా ఘోరతపము ఆచరిస్తుంది. ఈ తపస్సు ఆరంభంలో కేవలం ఫల, కంద మూలములను మాత్రమే తీసుకొని ఎండా వానలను లెక్కచేయక తపస్సు చేసిన అమ్మవారుతరువాతి కాలంలో రాలిన ఎండుటాకులను, చివరి రోజుల్లోఆహారమూ, నీళ్ళు కూడా ముట్టకుండా పరమేశ్వరుణ్ణి అహర్నిశలూ ఆరాధిస్తుంది. అమ్మవారి తపస్సు ధాటికి ముల్లోకాలూ వణికిపోతాయి. అప్పుడు పరమేశ్వరుడే నీ భర్త అవుతాడని బ్రహ్మ దేవుడు చెప్పగా అమ్మవారు తపస్సు విరమిస్తుంది. 

ఈ మాత దర్శనం అనంతఫలప్రదము. ఈమెను ఉపాసించేవారికి వైరాగ్యం, తపస్సు, త్యాగబుద్ధి, సదాచారం, ఓపిక వంటివి అబ్బుతాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా లక్ష్యంవైపే మనస్సు నిలపగలుగుతారు. బ్రహ్మచారిణీదేవి కృపవలన ఉపాసకులకు సిద్ది కలుగుతుంది . ఈ రోజు సాధకుని మనస్సు స్వాధిష్ఠాన చక్రములో స్థిరమవుతుంది. అమ్మవారికి ఈ రోజు పులిహోరను నైవేద్యంగా నివేదిస్తారు.

శ్లోకం

దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ ।

దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE