నవరాత్రి వేడుకల్లో మూడోరోజు అమ్మవారు చంద్రఘంటాదేవి అవతారంలో దర్శనమిస్తుంది. ఘంట ఆకారంలో ఉన్న అర్థ చంద్రుని శిరస్సున ధరించి ఉంటుంది.  తేజోవంతమైన ముఖవర్చస్సుతో, ఎంతో గంభీరంగా దర్శనమిచ్చే చంద్రఘంటాదేవి అవతారపు పరమార్థం దుష్టుల్ని అణచి వేయటమే. దుష్టసంహారానికి పలు ఆయుధాలతో సిద్దమైనట్లు కనిపించే ఈ తల్లి ఉపాసకులకు మాత్రం ఎంతో  సౌమ్యముగానూ, దర్శనమిస్తుంది. అమ్మ కృప చేత మానవులు పాప విముక్తులవుతారు.  చక్కని ఆయురారోగ్యాలను, పేరు ప్రఖ్యాతులను, వీరత్వాన్ని పొందుతారు.సకల భూతప్రేతాది బాధలు తొలగిపోతాయి. పరాజయం, భయం, అజ్ఞానం దరిజేరవు. 

అమ్మ యుద్ధానికి బయలుదేరే సమయంలో చేసే ఘంటారావానికి రాక్షసులు భీతిల్లి పరుగులు తీసేవారు. భీషణమైన ఆనాదం బ్రహ్మాండంసైతం ద్దలిరిల్లుతున్నట్లుంది గనుకే అమ్మకు ఆ పేరు వచ్చింది. బంగారు వర్ణంతో 10 చేతులతో తల్లి భక్తులకు దర్శనమిస్తుంది .మందారపువ్వు, కమండలము, జపమాల, శూల గదా ఖడ్గ ధనుర్భాణాలతో బాటు వరదాభయ ముద్రలో అమ్మ దర్శనమిస్తుంది. 

 అమ్మను గురించి సాధన చేసే సాధకుని మనస్సు ఈ రోజు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. దేవి కృపవలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం, దివ్య సుగంధ అనుభవము, వివిధ ధ్వనులు కూడా అనుభూతిలోకి వస్తాయని  చెబుతారు. ఈ రోజు నైవేద్యంగా కొబ్బరి అన్నం మరియు కొబ్బరి పాయసం సమర్పిస్తారు.

శ్లోకం

పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ।

ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

జపమూ యజ్ఞమే

పరమాత్మను చేరేందుకు సాయపడే సులువైన మార్గాల్లో జపం ముఖ్యమైనది. యోగసాధనలోనూ జపం ఒక ముఖ్యాంశంగా ఉంది. జప 

MORE