నవరాత్రి ఉత్సవాలలో ఐదవ అవతారం స్కందమాత. బాల స్కందుడిని (సుభ్రమణ్య స్వామి) ఒడిలోపెట్టుకొని మాతృ స్వరూపిణిగాఅమ్మ దర్శనమిస్తుంది. రెండు చేతులలో పద్మాలతో, మరో చేతితో అభయ ముద్రను ప్రదర్శిస్తూ దక్షిణ హస్తంతో బాల కార్తికేయుడిని పొదివి పట్టుకొని కనిపించే అమ్మను భక్తితో ఆరాధిస్తేకోరికలు నెరవేరుతాయి. 

ఈ రోజు సాధకుని మనస్సు విశుద్ధచక్రంలో స్థిరమవుతుంది. దీనివల్ల సాధకుని మనసు ప్రాపంచిక సంబంధాల నుంచి చైతన్య మార్గం వైపు పయనిస్తుంది. సింహవాహన అయిన ఈ తల్లిని శ్రద్ధతో ఉపాసన చేస్తే మోక్షం ప్రాప్తిస్తుంది. స్కందమాతను పూజిస్తే ఒడిలో కూర్చొని ఉండే స్కందుణ్ణీ పూజించినట్లే. స్కందమాత సూర్యమండల అధిష్ఠాన దేవత గనుక . ఈమెను ఉపాసించేవారు దివ్యతేజస్సుతో విరాజిల్లుతుంటారు.

శ్లోకం

సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।

శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥

 



Recent Stories







bpositivetelugu

పిల్లల చదువులో పెద్దల పాత్ర

 గతంలో కంటే ఇప్పటి మన విద్యావిధానం పూర్తిగా భిన్నమైనది. అప్పుడు ఉపాధ్యాయుల నిర్ణయం మేరకు పిల్లల చదువు సాగేది. 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE