భాద్రపదమాసంలోని బహుళ పక్షం పితృదేవతాపూజలకు ఎంతోశ్రేష్ఠమైనది. దీన్ని పితృపక్షమననీ,మహాలయ పక్షమనీ అంటారు. ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. ఈ పక్షంలో చివరి రోజుగా వచ్చే అమావాస్యకు మహాలయ అమావాస్య అనిపేరు. ఈ రోజు చేసే నదీ స్నానం, జపం, హోమమువిశేష ఫలితాన్నిస్తాయని పెద్దలు చెబుతారు. గురువు నుంచి మంత్రోపదేశం పొందేందుకూ ఈ రోజు ఎంతో అనువైనది. ఈ రోజు మహాలయ అమావాస్య సందర్భంగా దానికి సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

పురాణ గాథ

ద్వాపర యుగంలో దానశీలిగా పేరుపొందినకర్ణుడు మరణానంతరం స్వర్గలోకానికి వెళుతుండగా ఆకలిగా అనిపించి సమీపంలోనిచెట్టు నుంచి పండు కోసుకుని తినబోగా అది బంగారమై పోయింది. కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటి నీరు తాగబోగా ఆ నీరూ బంగారమై పోయిండట. దానానికి పర్యాయపదంగా నిలిచినా తనకు ఈ గతేమిటని వాపోయినా కర్ణుడికి అశరీరవాణి జవాబిచ్చింది. చేసిన దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావే గానే ఒక్కరికీ పట్టెడన్నం పెట్టలేదనీ అందుకే ఇలాంటిదుస్థితి ప్రాప్తించిందాని వివరించింది. అనంతరం తండ్రి సూర్యుని సలహా మేరకు ఇంద్రుడిని ప్రార్థించగా భూలోకానికెళ్లి ఆర్తులకు అన్నదానం చేసి మాతాపితరులకు తర్పణలు వదిలితే సమస్య తీరుతుందని తెలుసుకొని భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు భూలోకాన ఇంద్రుడు చెప్పిన ప్రకారం పితృదేవతలను పూజించి సంతోషంగా ఈ మహాలయ అమావాస్యనాడు తిరిగి స్వర్గానికెళ్లాడు.

విధులు

సంప్రదాయం ఉన్నవారుఈ పక్షం ముగిసే వరకు రోజూ లేదా తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు పెద్దలకు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరిస్తారు. ఆ ఆచారము లేనివారు బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు, పండ్లతో బీద బ్రాహ్మణులకు స్వయంపాకం సమర్పించడం లేదా ఒకరిద్దరు పేదలకు అన్నదానం చేయటం మంచిది.ఆ శక్తి కూడా లేనివారు నిద్రలేవగానే ఇంటి ప్రధాన ద్వారం లోపలవైపు నిలిచి చేతులు జోడించి, తమ పూర్వీకులను స్మరించి తన అశక్తత తెలియజేసి వారి దీవెనలు కోరాలి. కనీసం గూడు కూడా లేనివాడు ఊరిచివరికి వెళ్లి ఎండిపోయిన ముళ్ల కంచెను హత్తుకొని పితృదేవతలను గుర్తు తెచ్చుకొని వారికోసం నాలుగు కన్నీటి చుక్కలు రాల్చినా పితృదేవతలు సంతో షిస్తారని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE