• HOME
  • భక్తి
  • అష్టసిద్ధులను ప్రసాదించే సిద్ధిదాత్రి

అమ్మవారి తొమ్మిదవ శక్తి స్వరూప నామం ‘సిద్ధిదాత్రి’. అమ్మ ఉపాసన చేసేవారికి అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వములనే 8 సిద్ధులు ప్రాప్తిస్తాయి. ఈ దేవి కృప వలెనే సాక్షాత్తూ పరమేశ్వరుడు ఈ సిద్ధులనుపొందినట్లుదేవీ భాగవతం చెబుతోంది. ఈశ్వరుని అర్థ భాగంగా నిలిచినా ఈ తల్లి కారణంగానే ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు. సిద్ధిదాత్రి దేవి కమలంపై ఆసీనురాలై ఉంటుంది. నాలుగు హస్తాలతో భాసిల్లే ఈ మాత పై కుడి చేతిలో చక్రాన్ని మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్నీ, మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి దర్శనమిస్తుంది.

 శ్రద్ధ, నిష్ఠలతో ఈ మాతను ఉపాసించే సాధకుడికిబ్రహ్మాండాన్నే జయించే సామర్థ్యం లభిస్తుంది. సకల సిద్ధులూ కరతలామలకం అవుతాయి. అన్ని విధాలైన సాంసారిక వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతను అతీతుడై మానసికంగా దేవి దివ్య లోకంలో విహరిస్తాడు.

దుర్గాష్టమి

 దుర్గ అంటే? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది.దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దుష్ట శక్తులను, దరిద్రాలను దరిజేరనీయని తల్లి. ఈరోజు దుర్గసహస్రనామ పారాయణము, 'దుం' అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. దుర్గాదేవి "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందనీ,అందుకే ఆ రోజున లోహపరికరాలని పూజించే ఆనవాయితి వచ్చిందనీ పెద్దలు చెబుతారు. దుర్గాష్టమి రోజు సేమ్య పాయసం లేదా క్యారెట్ పాయసం లేదా కొబ్బరి గసగసాల పాయసం లేదా అన్నం పరమాన్నం లేదా పెసరపప్పు పాయసం లేదా కొబ్బరి పాల పాయసాన్ని అమ్మకు నివేదన చేస్తారు. 

శ్లోకం

సిద్ధగంధర్వయక్షాద్యైః అసురైరమరైరపి ।

సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥



Recent Stories







bpositivetelugu

పరిమళాల వాడకంలో మెళకువలు

మనసుకు, శరీరానికి హాయినిచ్చే పరిమళాలను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా మహిళలు, యువత ఈ విషయంలో ముందుంటారు.

MORE
bpositivetelugu

రంజాన్ దాన, ఉపవాసాల విశేషాలు

ఏ పండుగైనా శాంతిని, మానవాళి హితాన్నే ప్రబోధిస్తుంది. రంజాన్ (రమదాన్) పండుగా ఇదేవిషయాన్ని చెబుతోంది. ఇస్లామీయ కేలండర్లో

MORE