పూర్వం ఒక గురువుగారు  అడవిలో ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకునేవాడు. కొన్నాళ్లకు ఆయన దగ్గర కొందరు శిష్యులు చేరారు. గురువుగారు రోజూ కాసేపు శిష్యులకు బోధ చేసేవారు. ఒకనాడు ఆయన భగవంతుని గురించి శిష్యులకు బోధిస్తూ ' భగవంతుడు సర్వాంతర్యామి. కనుక మనమంతా ప్రతి ప్రాణిలోనూ ఆయన ఉనికిని గుర్తించి గౌరవించాల'ని చెప్పాడు. 

కొన్నిరోజుల తర్వాత వంటచెరుకు సేకరించే నిమిత్తం శిష్యులంతా  అడవికి వెళ్ళారు. ఎండిన కట్టెలు సేకరిస్తుండగా దూరం నుంచి ' మదపుటేనుగు వస్తోంది. దూరంగా పారిపోండి' అనే కేకలు  వినిపించాయి. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్నశిష్యులంతా ప్రాణభయంతో  తలోదిక్కూ పారిపోయారు. అయితే వారిలో ఒక శిష్యుడు మాత్రం 'ఏనుగులో ఉన్నదీ దేవుడే అయినప్పుడు పారిపోవటం దేనికని భావించి ఏనుగుకు నమస్కరిస్తూ అక్కడే నిలబడి పోయాడు. విపరీతమైన కోపంతో అరుస్తూ వస్తున్న ఆ ఏనుగును అదుపు చేసేందుకు నానా తిప్పలు పడుతున్నదాని మీది మావటి దారికి అడ్డంగా నిలబడ్డ శిష్యుడిని దూరం నుంచే పారిపొమ్మని బిగ్గరగా హెచ్చరించినా గురువు మాటను పట్టుకొన్న శిష్యుడు మాత్రం అలాగే నిలబడ్డాడు. 

ఇంతలో ఏనుగు రావటం, ఆ శిష్యుడిని దూరంగా ముళ్లపొదల్లో తోసిపారేయటం క్షణకాలంలో జరిగిపోయాయి. గాయాలపాలై సృహ కోల్పోయిన శిష్యుడిని తోటి శిష్యులు ఆశ్రమానికి మోసుకుపోయి సపర్యలు చేయగా అతడు సృహలోకి వచ్చాడు. కోరి కోరి ఎందుకీ దుస్థితి తెచ్చుకున్నావంటూ అక్కడికొచ్చిన గురువు విసుక్కోగా దానికి శిష్యుడు గురువు గతంలో చెప్పిన మాట గుర్తు చేశాడు. అప్పుడు గురువు గారు 'నిజమే నాయనా, ఏనుగు రూపంలోని వచ్చిన దేవుడి గురించే ఆలోచించిన నువ్వు దాని మీద మావటి రూపంలో కూర్చున్న దేవుడి సంగతి ఎలా మరిచిపోయావ' ని ప్రశ్నించగా తన అజ్ఞానానికి సిగ్గుపడిన శిష్యుడు తలదించుకొన్నాడు. 

విచక్షణ గురించి యువకుడైన వివేకానందునికి  రామకృష్ణ పరమహంస చెప్పిన చిన్న కథ ఇది. ప్రాపంచిక జీవితంలో ఎదురయ్యే పలు సవాళ్ళను యువత తమ వివేచనతో అధిగమించాలనేది ఈ కథ సారాంశం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE