ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. చాంద్రమానం ప్రకారం ఇది 8వ మాసం. శరదృతువులో రెండవ మాసం. ఈ నెలలో పూర్ణిమ నాటి చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తాడు గనుక ఈ మాసానికి కార్తీకమని పేరు. కృత్తికా నక్షత్రానికి అధిపతి అగ్నిదేవుడు గనుక దీన్ని అగ్ని నక్షత్రమని అంటారు. ఈ మాసంలో చేసే నదీ స్నానం, శివారాధన, దీపదానానికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని శివపురాణం చెబుతోంది. 

ఆచరించాల్సిన పుణ్య  విధులు 

కార్తీక స్నానం : ఈ మాసంలో వేకువనే నిద్రలేచి తలస్నానం చేసిపొడిబట్టలు ధరించి ఇంటిలో దీపారాధన చేసి, తర్వాత ఏదైనా ఆలయంలో దీపం వెలిగించి చివరగా నది, కాలువ లేదా చెరువు నీటిలో  దీపాలను వదలుతారు. కార్తీక స్నానాన్ని దీపావళి రోజు నుంచి నెలంతా చేస్తారు. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమరోజుల్లోనైనా తప్పక కార్తీక స్నానం ఆచరించాలి.  

ఉపవాసం: ఈ మాసంలో పగలంతా వండని ఆహారం (పాలు, పండ్లు, గింజలు ) మాత్రమే తీసుకొని శివనామ స్మరణతో గడుపుతూ  సాయంత్రం శివారాధన చేసి భోజనం చేయటం వల్ల శివలోక ప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెబుతోంది. 

ప్రదోషకాల దర్శనం : కార్తీక మాసంలోప్రదోషకాలంలో(అంటే సూర్యాస్తమయం తర్వాత గంట లోపు) శివదర్శనం చేసుకునేవారికి అక్షయమైన పుణ్యఫలం లభిస్తుంది. ప్రదోషకాలంలో పరమేశ్వరుని సేవించేందుకు సకల దేవతలు కొలువు దీరి ఉంటారు గనుక ఆ సమయంలో స్వామి దర్శనం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి. 

దీపారాధన: కార్తీకమాసంలో చేసే దీపారాధన విశేష ఫలితాన్నిస్తుంది.  ఈ మాసమంతా ఆలయంలో, ఇంటి సింహ ద్వారానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించటం, ఆలయంలో ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేసేవారికి విశేషమైన ఫలితం లభిస్తుంది . ఆలయానికి వెళ్లలేనివారు పూజామందిరం, తులసి కోట, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల వద్దనైనా వెలిగించవచ్చు. దీపం వెలిగించే స్తొమత లేనివారు కనీసం ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోకుండా చూసినా పుణ్యప్రదమే! 

పారాయణం: ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేసినా లేక పంచాక్షరీ మంత్రం జపం చేసిన వారికి శివలోకప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెబుతోంది. 

పలుకారణాల వల్ల కార్తీక మాసమంతా పైన చెప్పుకున్నపుణ్య విధులను ఆచరించలేని వారు కనీసం ఈ మాసంలో వచ్చే చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథులతో బాటు సోమవారం రోజుల్లోనైనా వాటిని ఆచరించగలిగితే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE