కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశినిక్షీరాబ్ది ద్వాదశిగా జరుపుకుంటారు.దేవదానవులు పాలసముద్రాన్ని మధించిన రోజు కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి అనీ, ఆషాఢశుద్ధ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీహరి 4 నెలల తరువాత కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొని తిరిగి పాలసముద్రంలో దర్శనమిచ్చిన కారణంగా క్షీరాబ్ది ద్వాదశి అని పురాణ కథనం. దీనినే కొందరు హరిబోధినీ ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి,కైశిక ద్వాదశి వంటి పలు పేర్లతో జరుపుకుంటారు.క్షీరసాగర మధనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని విష్ణువు వివాహమాడినదీఈ రోజే. అందుకే ఈఈరోజు విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మకు, లక్ష్మీస్వరూపమైన తులసికి వివాహం చేస్తారు. మోహినీ అవతారంతో శ్రీమహావిష్ణువు దేవతలకు అమృతం పంచిరోజు కూడా గనుకే ఈ రోజు విష్ణాలయాల్లో స్వామిని మోహినీరూపంతో అలంకరించటంతో బాటు సుగంధద్రవ్యాలు కలిపిన క్షీరాన్ని అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా పంచుతారు.

తులసిపూజ ప్రత్యేకం

క్షీరాబ్ది ద్వాదశిరోజున తప్పనిసరిగా తులసిని పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఎప్పుడూ పాలసముద్రంలో శేషతల్పం మీద కొలువుదీరి ఉండే శ్రీమన్నారాయణుడు ఈ రోజు శ్రీమహాలక్ష్మీతో కూడి బృందావనానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు గనుక ఈ ద్వాదశి ని బృందావన ద్వాదశి అని కూడా అంటారు. అందుకే ఈ రోజున భక్తులు తులసికోటనే బృందావనంగా భావించి పూజిస్తారు. ఈ రోజు తులసి కోట (బృందావనం) ముందు అయిదు పద్మాలు వేసి వాటి మీద దీపాలుంచి తులసి దేవిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి. ఏకాదశినాడు ఉపవాసముండి ద్వాదశి నాడు తులసి కోట వద్దఅయిదు భక్ష్యాలను, ఫలాలను నివేదించి అయిదు తాంబూలాలను సమర్పించి పూజ చేసి, యథాశక్తి మేరకు బీదలకు దానం చేసి అనంతరం భోజనం చేయాలి. ఈ రోజున తులసిని పూజించినా, దర్శించినా విశేషమైన పుణ్య ఫలం లభిస్తుందనీ , అకాల మృత్యువు దరిచేరదనిపురాణాలు చెబుతున్నాయి. 

శ్రీ తులసీ స్త్రోత్రమ్

జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే

యతో బ్రహ్మాదయో దేవాః సృష్టి స్థిత్యంత కారిణీ

నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే

నమో మోక్షప్రదే దేవి నమ సంపత్ప్రదాయికే



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE