• HOME
  • భక్తి
  • కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యం

ఈ రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజున చేసే శివదర్శనం, శివాభిషేకం విశేష ఫలితాన్నిస్తాయి. ఈ రోజు  శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. దీనినే కొన్ని ప్రాంతాల్లో "త్రిపురి పూర్ణిమ", "దేవ దీపావళి" అని కూడా అంటారు. కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజు కూడా ఇదే . కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం. గురునానక్ జయంతి కూడా ఈరోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు. 

ఈ రోజు నదీస్నానం చేసి శివాలయంలో దీపాలు వెలిగిస్తారు.  సమీపంలోని చెరువు, నదుల్లో అరటిదొప్పల మీద దీపాలు పెట్టి వదులుతారు. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. ఏడాదంతా పూజ చేసే అవకాశంలేనివారు కనీసం ఈ రోజైనా ఇలా చేయగలిగితే మంచిది. మహిళలు సాయంత్రం వేళ ఇంటిలోని  తులసికోట ఎదుట దీపం వెలిగించటంతో బాటు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది.

జ్వాలా తోరణం

కార్తిక పూర్ణిమనాడు సాయంత్రం శివాలయాల్లో ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలను నాటి, మరో కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణంలాగా ఉంటుంది. దీనికి ‘జ్వాలాతోరణం” అని పేరు. శివపార్వతులను పల్లకీలో ఉంచి జ్వాలాతోరణం క్రింద తిప్పతారు. దీన్ని ‘జ్వాలాతోరణోత్సవం” అంటారు.



Recent Stories







bpositivetelugu

దీపావళి టపాసులతో జర భద్రం

 పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE