మనదేశంలోని సర్పాన్ని నాగదేవతగా భావించి ఆరాధించటం కనిపిస్తుంది. ప్రతి జీవిలోనూ దైవమున్నాడనే ఉదాత్త భావన నాగారాధన ప్రధాన ఉద్దేశం. మన పురాణాల్లో కూడా సర్పానిది విశిష్టమైన స్థానం. ఇప్పటికీ దేవతా వృక్షాల నీడన చేసిన నాగమూర్తులు మనకు గ్రామగ్రామాన కనిపిస్తాయి. నాగారాధన పలు ఆసియా దేశాల్లోనూ కనిపిస్తుంది.సంతానం లేనివారికి,చెవి, చర్మ సంబంధ వ్యాధుల బాధితులకు నాగారాధనతో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయని విశ్వాసం. తెలుగునాట ముఖ్యంగా కార్తీక శుద్ద చవితిని నాగుల చవితిగా జరుపుకోవటం ఆచారం. ఈ రోజు నాగ పూజ చేసేవారికి పలురకాల దోషాలతో బాటు సర్పభయం ఉండదని పెద్దలు చెబుతారు.

శరదృతువు ఆహ్లాదకరమైన ప్రకృతి మూలంగా ఈ రోజుల్లో పాములు బయట ఎక్కువగా సంచరిస్తాయి. వాటి గురించి ప్రజలకు తగిన అవగాహన కల్పించటంతో బాటు జీవావరణ చక్రంలో సర్పం యొక్క ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ పండుగ వచ్చి ఉండవచ్చు. నాగుల చవితి రోజు పగలు ఉపవాసముండి మరునాడు నాగ ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం చేసి పుష్పాలతో అలంకరించి పాలు, చలిమిడి, వడపప్పు, నువ్వులతో చేసిన చిమ్మిలి, క్షీరాన్నం మొదలైనవి నైవేద్యం గా సమర్పిస్తారు. ఈ పూజ వల్ల సకల దోషాలూ తొలగిపోవటంతో బాటు సంతానం కలగకపోవడం, పెళ్లి కాకపోవటం, భార్యాభర్తలు విడిపోవడం, చిన్నతనంలోనే వైధవ్యం ప్రాప్తించడం వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. 

 



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

జపమూ యజ్ఞమే

పరమాత్మను చేరేందుకు సాయపడే సులువైన మార్గాల్లో జపం ముఖ్యమైనది. యోగసాధనలోనూ జపం ఒక ముఖ్యాంశంగా ఉంది. జప 

MORE