• HOME
  • భక్తి
  • బహుమతులిచ్చే తాత .. శాంటాక్లాజ్

క్రిస్మస్ వేళ పిల్లలకు ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ తాతయ్య. ఆయననే పశ్చిమదేశాలవారు  శాంటాక్లాజ్ అంటారు. నెత్తి మీద టోపి, తెల్లని పొడవైన గడ్డం, ముఖం నిండా నల్లని ఎర్రని రంగులు, ఎర్రటి డ్రెస్, ఆకట్టుకునే చిరునవ్వుతో మంచు కొండలమీదుగా ధృవపు జింకల బగ్గీపై  వచ్చి క్రిస్మస్ చెట్టుకు తాము వేలాడదీసిన మేజోళ్లలో బహుమతులు పెట్టి వెళతాడని క్రిస్మస్ వేళ పిల్లలు ఎదురు చూస్తుంటారు . అయితే ఈ క్రిస్మస్ తాత కథ వెనుక ఒక యదార్థ గాథ ఉంది. దాని ప్రకారం 13 వ శతాబ్దంలో డెన్మార్క్‌లో సెయింట్ నికొలస్ అనే క్యాథలిక్ బిషప్ ఉండేవాడు. అదే ఊరిలోని ఒక నిరుపేద రైతు తన ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయలేక ఇబ్బంది పడుతూ ఉండేవాడు. అతని సమస్యను గుర్తించిన బిషప్ ఒక రాత్రి వేళ ఆ నిరుపేద ఇంటిమీదున్న పొగగొట్టంలో నుంచి 3 బంగారు నాణాలున్న సంచులను జారవిడుస్తాడు. అయితే అవి నేరుగా జారి  పొయ్యిపక్కనే ఆరేసిన మేజోళ్ళలో (సాక్సులు) పడతాయి. మరునాడు ఈ సంగతి ఆ నోట ఈ నోట పాకటంతో బీదలంతా తమకూ ఎంతోకొంత సాయం అందుతుందని ఎదురు చూడటం మొదలు పెట్టారు. బిషప్ ప్రేరణతో మనసున్న ఎందరో ధనికులు క్రిస్మస్ తాతయ్యల రూపంలో తమ ప్రాంతంలోని పేదలకు రహస్యంగా సాయం చేయటం మొదలుపెట్టారు.   అలా మొదలైన ఈ సాయం క్రమంగా విస్తరించి నేడు శాంటా క్లాజ్ రూపంలో కొనసాగుతోంది. 

లోకానికి బహుమతిగా అనుగ్రహించు బడిన యేసు క్రీస్తు పూర్తియిన రోజును కేవలం అలంకరణలకు, హంగూ  ఆర్భాటాలకు పరిమితం చేయకుండా  నిరుపేదల ముఖంలో ఆనందం చూసేందుకు మనమంతా  పూనుకోవాలనేదే శాంటాక్లాజ్ పాత్ర అసలు ఉద్దేశం.అప్పుడే అది ఆనందకరమైన, అర్థవంతమైన, ఆత్మీయవంతమైన  క్రిస్మస్ అవుతుంది.Recent Storiesbpositivetelugu

దీపావళి టపాసులతో జర భద్రం

 పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE