మార్గశీర్ష మాసంలో సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. తొలిఏకాదశి నాడు యోగనిద్రలోకి జారిన విష్ణు మూర్తి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొని శుద్ధ త్రయోదశి రోజున దేవతలతో కూడి బృందావనానికి చేరుకుని, ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశినాడు ఉత్తరద్వారము నుండి మనకు దర్శనమిస్తాడు. ఆయన దర్శనభాగ్యం వలన క్షీణించిన శక్తిని తిరిగి పొందిమకర సంక్రాంతి నుంచి ఆరంభమయ్యే ఉత్తరాయణ పుణ్యకాలములో జనులు సంతోషంగా గడుపుతారు.

ప్రత్యేకతలు

ఈ ధనుర్మాసంలో ఇంటి ముంగిళ్ళలోఆవు పేడ కళ్ళాపి జల్లుతారు.దీనిపై లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ముగ్గులు తీర్చి దిద్దుతారు. వాటిపై గొబ్బెమ్మలను పెట్టి పూలు, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. పేడ కళ్ళాపి, సున్నంతో కూడిన ముగ్గు వల్ల సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ఈ మాసంలో భగవన్నామ స్మరణ అవసరాన్ని గుర్తు చేస్తూ ఇల్లిల్లూ తిరిగే హరిదాసును గౌరవించటం సాక్షాత్తూ భగవంతుని గౌరవించటమే అని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో గంగిరెద్దుల వారు ఉదయం పూట ఇల్లిల్లూ తిరుగుతారు. లక్ష్మీ రూపాలైన గోవుల గిట్టలు, ధర్మ స్వరూపాలైన వృషభాల గిట్టల స్పర్శ చేత ఇల్లిల్లూ పవిత్రం అవుతుంది. శంఖం దైవ స్వరూపం. ఈ ధనుర్మాసంలో జంగమ దేవరలు శంఖం ఊదుతూ తిరుగుతారు. పంటలు ఇంటికి చేరి యజమాని మొదలు కూలీ వరకు కడుపు నిండా తినగలిగే రోజులూ ఇవే. గోదాదేవిశ్రీరంగనాథుని అర్చించి తరించిన ఈ పవిత్ర మాసం కూడా ఇదే. ఈ మాసంలో చేసే విష్ణు ధ్యానం, పూజ, దానాలు విశేష ఫలితాన్నిస్తాయి. భోగి పండుగ వరకు సాగే ఈ ధనుర్మాసంలో మిగిలిన ఈ రోజుల్లోనైనా హరి నామ స్మరణ చేసి ఆయన కృపకు పాత్రులమవుదాం.Recent Storiesbpositivetelugu

సంతోషమయ జీవితానికి..

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ 

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE