భగవదారాధనతో దైవానుగ్రహాన్ని పొందేందుకు మన పూర్వులు ఏర్పరచిన పర్వ దినాలలో ఏకాదశి వొకటి. ఈ ఏకాదశుల్లో 4 ఏకాదశులను పెద్దలు విశేషమైనవిగా చెబుతుండగా అందులో మాఘ శుద్ధ ఏకాదశి ఒకటి. మాఘ శుద్ధ అష్టమి నాడు అంపశయ్యమీద నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఆ మహానుభావుని పేరిట 'భీష్మ ఏకాదశి'గా జరుపుకుంటున్నాము. ఈరోజునే కామదైకాదశి, జయైకాదశి అని కూడా వ్యవహరిస్తారు. విష్ణుప్రీతికరమైన ఈ మహాపర్వం రోజు చేసే నారాయణార్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి. 

భారతకధలో మహోన్నతులైన వారిలో భీష్మపితామహుడు ఒకడు. ఆజన్మ బ్రహ్మ చారి, అష్ట వసువులలో ఒకడు, అతి పుణ్యాత్ముడు, ఇచ్చా మరణాన్ని(కోరిన క్షణంలో మరణించేలా) వరంగా పొందినవాడు, మహాతపస్వి. భీష్ముడు వీరత్వానికి, పితృభక్తికి, ప్రతిజ్ఞా పాలనకు పర్యాయపదం. ఆయన భవత్తత్వాన్ని అవగతం చేసుకున్నవాడు కనుకే రాజసూయ యాగంలో కృష్ణుడికే అగ్రతాంబూలం దక్కాలని ప్రకటించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని రక్షించేందుకు చక్రాయుధంతో తన మీదకు దూసుకొచ్చిన కృష్ణ పరమాత్మను చూసి ఆయుధాలను వదిలి రథం దిగి మోకాళ్ళమీద కూర్చొని ముక్తిని ప్రసాదించమని కోరాడు.చివరకు కృష్ణుని ప్రేరణ మేరకే అంపశయ్య మీది నుంచి ధర్మదేవత ప్రతిరూపమైన ధర్మరాజుకు విష్ణు సహస్ర నామం పేరిట గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు.భగవంతుడైన శ్రీ కృష్ణుడు అక్కడేనిలబడి చిరు నవ్వు తో వీటిని ఆలకించి ఆమోదించాడు. 

పుణ్యవిధులు

ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి, భీష్ముడి తర్పణం వదలాలి. తల్లిదండ్రులు ఉన్నవారు సైతం ఈ తర్పణాన్ని వదలవచ్చు . ఈ రోజు భక్తి శ్రద్ధలతో శ్రీమహావిష్ణువును పూజించి నైవేద్యం సమర్పించి రోజంతా ఉపవసించాలి. ద్వాదశి ఘడియలు రాగానే అతిథితో బాటు కలిసి ఉపవాసనాన్ని విరమించాలి. ఈ రోజున విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేయటం అనంత ఫలాన్నిస్తుంది. చదవలేని వారు కనీసం విన్నా చాలు .Recent Storiesbpositivetelugu

దీపావళి టపాసులతో జర భద్రం

 పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE