శివుడు అభిషేక ప్రియుడు. భక్తితో దోసెడు నీళ్లు నెత్తిన పోసినా పరవశించి కోరినది ఇచ్చే పరమ దయాళువు. తమ తమ కోరికను బట్టి తగిన పదార్థంతో శివయ్యను అభిషేకించాలని పెద్దలు చెబుతారు. ఈ క్రమంలో మహాశివరాత్రి రోజున ఏ పదార్థాలతో శివునిని అభిషేకిస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో తెలుసుకుందాం. 

  కస్తూరి, జవ్వాది, పునుగు, గులాబీ అత్తరు వంటి దివ్యపరిమళాలు కలిపిన నీటితో ఈ రోజు అభిషేకం చేస్తే కైలాసప్రాప్తి, పలురకాల పువ్వులతో శివాభిషేకం నిర్వహిస్తే రాజభోగం, వెండి పొడితో శివాభిషేకం చేస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది.వంశవృద్ధిని కోరుకునేవారు వెదురు చిగుళ్ళతో , కీర్తిప్రతిష్టలు, ధనం కోరేవారు పాలతో అభిషేకం చేయాలి. మారేడు చెట్టు బెరడు, వేర్ల నుంచి తీసిన భస్మంతో చేస్తే ఎంతటి దారిద్రమైనా పటాపంచలు అవుతుంది.  

నవధాన్యములతో శివాభిషేకం చేసినవారికి ధనలాభంతో  భార్యా, పుత్రలాభం సిద్ధిస్తుంది. ఆరోగ్యాన్ని కోరుకునేవారు మాత్రం పటికబెల్లపు పలుకులతో శివాభిషేకం చేయాలి. శివయ్యను ఉప్పుతో అభిషేకించిన మహిళకు సౌభాగ్యం సిద్ధిస్తుంది. విభూది అభిషేకం వలన కార్యసిద్ధి కలుగుతుంది.  ప్రేమవ్యవహారాల్లో సానుకూల ఫలితం కోరుకునేవారు స్వామిని బెల్లపు పలుకులతో అభిషేకం చేయాలి.  

విజయాన్ని కోరేవారు పలు రకాల పండ్లతోనూ, ఉసిరికాయలతో చేస్తే మోక్షము, బంగారుపొడితే అభిషేకం చేస్తే మహాముక్తి లభిస్తుంది. అష్టధాతువులతో చేసే అభిషేకం సిద్ధినిస్తుంది. మణులతో, వాటి పొడులతో అభిషేకిస్తే అహంకారం తొలగిపోతుంది. పాదరసముతో అభిషేకించితే అష్టైశ్వర్యములు లభిస్తాయి. ఆవునెయ్యి, ఆరు పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే ఆయువు పెరుగుతుంది.Recent Storiesbpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

  దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత 

MORE