• HOME
  • భక్తి
  • పునరుత్థాన ఆదివారమే..ఈస్టర్

ఈ లోకంలోని పాపుల తరపున శిలువపై ప్రాణత్యాగం చేసి, సమాధి చేయబడిన ఏసుప్రభువు తిరిగి లేచిన రోజునే క్రైస్తవులు ఈస్టర్ పండుగగా జరుపుకుంటారు. సంతాపదినమైన శుభ శుక్రవారానికి భిన్నంగా ఈ రోజు ఆనందోత్సాహాలతో జరుపుకొంటారు. 

నేపథ్యం

శిలువపై ప్రాణత్యాగం చేసిన ఏసుప్రభువును జోసెఫ్‌ అనే వ్యక్తి కిందకు దించి ఆ ఆ మృతదేహాన్ని సమాధి చేశాడు. అయితే సంప్రదాయం ప్రకారం ఆ సమాధిలో ఎలాంటి సుగంధ ద్రవ్యాలూ వేయకపోవటాన్ని గమనించిన కొందరు గలిలీ మహిళలు ఇంటికి వెళ్లి కొన్ని సుగంధద్రవ్యాల్ని తయారుచేసి, ఆదివారం రోజు సమాధి తీసుకు వెళ్లారు. అయితే.. వారక్కడికి చేరే సరికి సమాధిమీది పెద్ద బండరాయి పక్కకు దొర్లినట్లు కనిపించింది. వారు సమాధిలోకి చూడగా అందులోని ఏసు మృతదేహం లేకపోవడంతో వారంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు మిరుమిట్లుగొలిపే కాంతితో తెల్లని వస్త్రాలు ధరించిన దేవదూతలు ఏసు ప్రభువు యొక్క పునరుత్థానం గురించి తెలియజేస్తారు. దీంతో ఆ మహిళలు సంతోషంతో ఊళ్లోకి పరుగులు పెడుతూ ఈ వార్తను అందరికీ తెలియజేస్తారు. దేవుని కుమారుడు తిరిగి వచ్చిన సందర్భాన్ని స్వాగతిస్తూ నాడు జరిగిన వేడుకకు కొనసాగింపే నేటి ఈస్టర్ పండుగ. 

ప్రత్యేకతలు

మరణానికి చిహ్నమైన రాత్రి చీకట్లను పారదోలటానికి గుర్తుగా క్రైస్తవులు ఈస్టర్ రోజున ' నైట్‌ ఆఫ్‌ ఇల్యుమినేషన్‌' పేరిట చర్చిలో కొవ్వొత్తులు వెలిగిస్తారు. వాటిని చేతబట్టుకుని నగరమంతా సమూహంగా పర్యటిస్తారు. దీన్ని ఈస్టర్‌ పెరేడ్‌ అంటారు. ఈ రోజు నూతన వస్త్రాలు ధరించి ప్రార్థనల అనంతరం బంధుమిత్రుల ఇళ్లకెళ్ళి బహుమతులు ఇచ్చిపుచ్చుకొంటారు. పశ్చిమ దేశాల్లో ఈ రోజున అందంగా అలంకరించిన కోడిగుడ్లను ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది. కోడిగుడ్డు లోపలి పిల్ల బలమైన పై పెంకును తొలగించుకొని బయటి వచ్చినట్లు ఏసుప్రభువు పునరుత్థానం జరిగిందని భావిస్తారు. ఈ రోజున వేరు వేరు కేకులు చేసి పంచుకోవటం కూడా సంప్రదాయంగా ఉంది.



Recent Stories







bpositivetelugu

దీపావళి టపాసులతో జర భద్రం

 పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE