కలియుగంలో భగవన్నామ స్మరణకు మించిన ఉత్తమ సాధన మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. భగవన్నామంలో ఒక నిగూఢమైన శక్తి, మహిమ ఉంటాయి. అయితే.. ఏడుకోట్ల మహామంత్రాలలో రామనామానికున్న విశిష్టత, శక్తి మరే మంత్రానికి లేదనీ మనుస్మృతి చెబుతోంది. హరిహర తత్వాలు కలగలిసిన ఈ రామనామాన్ని తారక మంత్రమనీ అంటారు. రాముని శక్తి కంటే రామనామ ప్రభావమే మిన్న అని రామాయణం చెబుతోంది. రామనామ జపంతో మానవ జీవితం సాఫీగా సాగుతుందని పెద్దలు చెబుతారు . ఇంతటి మహిమాన్వితమైన రామ నామం విశిష్టత గురించి తెలుసుకుందాం.

ఆవిర్భావం

 'నారాయణ', నమశ్శివాయ శబ్దాల రెండో అక్షరాలను కలిపి బ్రహ్మ రామ శబ్దాన్ని సృష్టించగా, నారద మహర్షి ద్వారా ఇది భూలోకాన్ని చేరింది. అక్కడ నారదుడు దీన్ని అజ్ఞానంతో హింసాయుత మార్గంలో ఉన్న బోయవానికి ఉపదేశించగా అతడు ప్రాపంచిక ఆసక్తులను వదిలి ఏళ్ళ తరబడి రామనామాన్ని స్మరిస్తాడు. ఇది తపంగా మారి తనపై పాములు పుట్టలు పెట్టినా గుర్తించని స్థితికి చేరతాడు. ఆ పుట్టల నుంచి ప్రతిధ్వనిస్తున్న రామనామం బ్రహ్మలోకము చేరుతుంది. అప్పుడు బ్రహ్మ తన చూపును ఆ పుట్ట మీదికి సారించగా, అందులోనుంచి బంగారు వన్నెచాయ మేనితో, తెల్లని గడ్డము, జడలతో ఒక చేతిలో కమండలము, మరో చేత దండముతో ఒక మహర్షి బయటికి వస్తాడు. వల్మీకము (పుట్ట) నుంచి లేచి వచ్చిన ఆ మహర్షికి 'వాల్మీకి' అని పేరును సూచించి శ్రీమద్రామాయణ రచనకు ప్రేరేపిస్తాడు. అలా రామనామం బ్రహ్మలోకం నుంచి భూలోకానికి చేరింది.

విశిష్టతలు

  • రామనామ జపంతో దుష్కర్మలు నశించి మనోనిబ్బరం ఏర్పడుతుంది. ఫలితంగా మానసికానందం సొంతమవుతుంది.
  • ఒక్కసారి నోరార రామనామాన్ని జపిస్తే నిష్టతో 108 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించిన ఫలం లభిస్తుంది.
  • నిత్యం రామ నామ జపం చేసేవారికి అంతిమ ఘడియల్లో సాక్షాత్తూ శివుడే రామనామాన్ని ఉపదేశిస్తాడని శివపురాణం చెబుతోంది.
  • ఒకసారి రామ నామాన్ని జపిస్తే విష్ణుసహస్రనామ పారాయణ ఫలం సిద్ధిస్తుంది.
  • త్యాగరాజు 21 ఏళ్ళ 15 రోజుల పాటు,రోజుకు లక్షా ఇరవై అయిదు వేలచొప్పున 96 కోట్ల సార్లు రామనామ జపం చేసి రామ సాక్షాత్కారం పొందగా, సమర్థరామదాసు 13 కోట్ల సార్లు జపించి రామ దర్శనం పొందారు. కబీర్‌దాస్, తులసీదాస్, భక్తరామదాసు వంటి భక్తులంతా రామనామ జప ఫలితాన్ని పొందినవారే.
  • రామనామ జపం తో శని దోషాలు దరిజేరవు. ఎందుకంటే.. పూర్వం శనీశ్వరుడు హనుమంతుని కష్టాలపాలు చేసేందుకు రామనామ జపం చేస్తున్నహనుమను చేరి వచ్చిన పని వివరిస్తాడు. దానికి హనుమ జపం ముగిసేవరకు ఉండమని చెబుతాడు. శనీశ్వరుడు ఎంత నిరీక్షించినా.. రామనామ జపం పూర్తికాకపోవడంతో నాటి నుంచి రామనామం జపించేవాళ్ల దగ్గరకు శనీశ్వరుడు వెళ్ళటం మానుకున్నాడట.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE