• HOME
  • భక్తి
  • సత్సంతాన ప్రాప్తికి గరుడ పంచమివ్రతం

కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినత కుమారుడు గరుత్మంతుడు కాగా కద్రువకు సర్పజాతి జన్మించింది.  శ్రావణ శుద్ధ పంచమి నాడు సర్పజాతి జన్మించిన కారణంగా ఈ రోజును 'నాగ పంచమి'గానూ, ఇదే రోజు వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక దీన్ని 'గరుడ పంచమి' అనీ అంటారు. 

శ్రావణ శుద్ధ పంచమి నాడు సర్పజాతి ఆవిర్భవించిన కారణంగా ఈ రోజున సర్పభయం లేకుండా నాగపూజ చేయటం ఆనవాయితీ . అలాగే గరుత్మంతుని వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తారు. సోదరులున్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది. సౌభాగ్యం, సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవిని పూజిస్తారు. విశేషమైన ఈ వ్రతాన్ని పదేళ్లు ఆచరించి, ఆ తరువాత ఉద్యాపన చెప్పుకొంటారు.

సాధారణంగా ఏ తల్లి అయినా కొడుకు తాను గర్వించేలా,లోకం మెచ్చేలా వుండాలని అనుకుంటుంది. అలా తన తల్లి దాస్య విముక్తికి గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. ఈ క్రమంలో ఏకంగా దేవేంద్రునితోనే పోరాడి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఆశీస్సులు పొంది ఆయన వాహనమయ్యాడు. ఈ గరుడ పంచమి నాడు ఈ  వ్రతాన్ని ఆచరించడం వలన, ఆరోగ్యవంతులైన,  ధైర్యవంతులైన సంతానం కలుగుతుంది. Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE